https://oktelugu.com/

ఓవైపు కరోనా.. మరోవైపు తిరుమల వెంకన్న..!

ఏడాదికాలంగా కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. దీనికితోడు కరోనా తాజాగా రూపాంతరం చెంది కొత్త వైరస్ ను వ్యాపింపజేస్తుండటంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. Also Read: ఈ కొత్త వైరస్‌ ఎలా వచ్చిందో తెలుసా..? బ్రిటన్లో కొత్తరకం వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో అన్నిదేశాలు అలర్టయ్యాయి. కొన్నిదేశాల్లో ఇప్పటికే క్రిస్మస్.. న్యూయర్ వేడుకలు రద్దు చేశాయి. మరికొన్నిదేశాలు కఠినంగా లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి. కొత్త కరోనా నేపథ్యంలో భారత్ సైతం ముందస్తు జాగ్రత్తలు చర్యలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 23, 2020 / 12:58 PM IST
    Follow us on

    ఏడాదికాలంగా కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. దీనికితోడు కరోనా తాజాగా రూపాంతరం చెంది కొత్త వైరస్ ను వ్యాపింపజేస్తుండటంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి.

    Also Read: ఈ కొత్త వైరస్‌ ఎలా వచ్చిందో తెలుసా..?

    బ్రిటన్లో కొత్తరకం వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో అన్నిదేశాలు అలర్టయ్యాయి. కొన్నిదేశాల్లో ఇప్పటికే క్రిస్మస్.. న్యూయర్ వేడుకలు రద్దు చేశాయి. మరికొన్నిదేశాలు కఠినంగా లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి.

    కొత్త కరోనా నేపథ్యంలో భారత్ సైతం ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటుంది. కేంద్రంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు బహిరంగ వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నాయి.

    ఇలాంటి తరుణంలో తిరుపతిలో ఈనెల 25నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మొదలవుతున్నాయి. పదిరోజుల పాటు వైకుంఠ దర్శనాలు మొదలు కాబోతున్నాయి. ఈమేరకు అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

    Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్.. ప్రపంచం అప్రమత్తం..!

    కలియుగ దేవుడైన తిరుమల వెంకన్నను వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 25తేదిన ప్రోటోకాల్ ప్రకారం ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శనాలు కల్పించనున్నట్లు టీడీడీ తెలిపింది.

    కోవిడ్ నిబంధనలు అనుగుణంగా స్వామివారి ఆలయం వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. పదిరోజుల పాటు జరుగనున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భక్తులకు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నదానం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్