HomeజాతీయంCongress Manifesto: 5 న్యాయ్‌ గ్యారంటీలు.. కాంగ్రెస్‌ మెనిఫెస్టో రెడీ

Congress Manifesto: 5 న్యాయ్‌ గ్యారంటీలు.. కాంగ్రెస్‌ మెనిఫెస్టో రెడీ

Congress Manifesto: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. అయితే అధికార బీజేపీ స్వీడ్‌ను ఏ పార్టీ అందుకోవడం లేదు. ఇప్పటికే 400కుపైగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ పొత్తులు కూడా ఖారారు చేసుకుంది. ఇక కాంగ్రెస్‌ పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఉంది. అయితే బీజేపీ కంటే ముందే మేనిఫెస్టో విడుదల చేయాలని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ చెండు విడుతలుగా చేపట్టిన పాదయాత్రల్లో గుర్తించిన ప్రజా సమస్యల ఆధారంగా మేనిఫెస్టో రూపొందించింది.

5 న్యాయాలు..
కాంగ్రెస్‌ పార్టీ 5 న్యాయాలతో మేనిఫెస్టో విడుదల చేసింది. కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీ హామీలు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాయి. దీంతో అదే మోడల్‌ను లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఫాలో అయింది. పాంచ్‌ న్యాయ్‌ పేరుతో ఐదు అంశాలపై మొత్తం 25 గ్యాంరటీలను కాంగ్రెస్‌ ప్రకటించింది. పార్టీ మేనిఫెస్టోలో లేవనెత్తిన ప్రతీ అంవాన్ని ప్రతీ గ్రామానికి, ప్రతీ పట్టణానికి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ సూచించింది.

పేద, మధ్యతరగతి వారే లక్ష్యంగా..
పాంచ్‌ న్యాయ్‌ పేరుతో రూపిందించిన మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, యువత, బలహీనవర్గాలే లక్ష్యంగా గ్యారంటీలు ఉన్నాయి. హిస్సేదారి న్యాయ్, కిసాన్‌ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్‌ న్యాయ్, యువ న్యాయ్‌ పేరిట హామీలను ప్రకటించింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, 6పస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ లేక ప్రైవేటు రంగంలో 25 ఏళ్లకంటే తక్కువ వయసు ఉన్న ప్రతీ డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్లకు అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణకు రూ.1లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువతకు స్టార్లప్‌లకు నిధులు సమకూర్చడానికి రూ.5 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు, పేపర్‌ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం పేద కుటుంబాల్లో ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలను మేనిఫెస్టోలో చేర్చింది.

ప్రజల ఆశిస్తున్నవే హామీలు..
వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించే మామీలపై అంత ఆసక్తి ఉండదు. రాష్ట్రస్థాయిలో జరిగే ఎన్నికలకు ప్రకటించే మేనిఫెస్టో మాత్రం హైలెట్‌ అవుతుంది. అదే అంశాలతో అన్నివర్గాల వారు ఆవిస్తున్నవే కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చేర్చింది. ఇందులో ఎంత మేరకు ప్రజలను ఆకట్టుకుంంటాయో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular