Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేనందుకు ఎన్నిలక సంఘం చర్యలు చేపట్టింది. విస్తృతంగా పార్లమెంటు ఎన్నికలపై ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా కొత్త ఓటర్ల నమోదుకు మరో అవకాశం కల్పించింది. ఏప్రిల్ 1 వరకు 15 ఏళ్లు నిండే అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించింది.
ఏప్రిల్ 15 వరకు ఛాన్స్..
పోలింగ్ శాతం పెంచడమ లక్ష్యంగా యువ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం క్యాంపెయిన్ చేపట్టింది. ఇంతకు ముందు కూడా పలుమార్లు ఓటరు నమోదు చేపట్టింది. అయినా ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించింది. దీంతో అధికారులు విద్యాసంస్థలకువెళ్లి ఓటరు నమోదుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే తీరును వివరించారు. అయినా ఆశించిన స్పందన లేదు. ఎక్కువ మంది ఓటు వేయడం ద్వారానే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందన్న బావనతో మరోమారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించింది.
ఓటరు నమోదు ఇలా..
ఏప్రిల్ 1 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. ఫామ్ 6 లో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. ఆధార్ కార్డుతోపాటు చిరేనామా ప్రూఫ్ ఇవ్వాలి. కరెంటు బిల్లు, నల్లా బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి జతపర్చాలి. తర్వాత బూత్‌లెవల్ ఆఫీసర్లు ఎంక్వయిరీకి వచ్చి ఓటరుగా రిజిస్టర్ చేస్తారు.
ఆన్‌లైన్‌లో ఇలా..
ఇక ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి http://voters.ecl.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ముందుగా ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. కొత్తగా ఓటరు నమోదుకు ఫామ్ 6 ఫిల్‌చేసి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కాపీలు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఏఈఆర్వోలు పరిశీలించి ఓటుహక్కు కల్పిస్తారు.
యాప్ ద్వారా..
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం లేకుండే గూగుల్ ప్లేస్టోర్ నుంచి voter helpline mobile aap డౌన్‌లోడ్ చేసుకుని కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత http://voters.ecl.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటరు గుర్తింపుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The election commission has given the opportunity for voter registration till april 15
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com