Chandrayaan 3 : చంద్రయాన్_2 విఫలమైన తర్వాత భారత్ దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకుంది. అందుకే చంద్రయాన్_3 ని పకడ్బందీగా ప్రయోగించింది. జూలై 14న ఎల్విఎం_ 3 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్_ 3 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23 అంటే బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సులభంగా సేఫ్ గా లాండ్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇస్రో ను కీర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు మిన్నంటాయి. ఈ సమయంలో భారత నెటిజన్లు పాకిస్తాన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు..
వాస్తవానికి పాకిస్తాన్ జాతీయ జెండాలో చందమామ ఉంటుంది. కాకపోతే అది అర్థ వృత్తాకారంలో ఉంటుంది. మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అంతరిక్షంలో అంతంతమాత్రంగానే ప్రయోగాలు చేసింది. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించి పోవడంతో అంతరిక్ష ప్రయోగాలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టింది. దేశాభివృద్ధిని విస్మరించి కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ప్రోత్సహించడం మొదలుపెట్టింది. తన దేశ అవసరాలకు చైనా మీద ఆధారపడడం ప్రారంభించింది. చివరికి ఆ దేశానికి సంబంధించి సొంత నావిగేషన్ సిస్టం కూడా లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇండియా మాత్రం అంతరిక్షంలో అంతకంతకు తన పాత్రను పెంచుకుంటూ పోతుంది. చంద్రుడి మీద రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలు రకరకాల ప్రయోగాలు చేసినప్పటికీ.. ఆ ఉపగ్రహం మీద నీటి జాడలు ఉన్నాయని తెలిపింది ఇస్రోనే. చంద్రయాన్_2 విఫలమైన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని చంద్రయాన్_3 ని ఆకాశంలోకి వదిలింది. ఇస్రో ఊహించినట్టుగానే చంద్రుడి మీద విక్రం ల్యాండర్ విజయనాదం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇదే సమయంలో “జెండా మీద చంద్రుడు ఉండడం, చంద్రుడు మీద జెండా పాడడం బోత్ ఆర్ నాట్ సేమ్” అనే మీమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అఖండ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగును దీనికి జోడించి పాకిస్తాన్ అంతరిక్ష సంస్థను భారత నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/VJViper_jd7/status/1694328548507660605?s=20