HomeజాతీయంChandrayaan - 3 : చంద్రుడిపై బతకడం కష్టమే.. చంద్రయాన్_3 ఏం చెబుతోందంటే..

Chandrayaan – 3 : చంద్రుడిపై బతకడం కష్టమే.. చంద్రయాన్_3 ఏం చెబుతోందంటే..

Chandrayaan – 3 : చంద్రుడు చల్లని వెన్నెల కురిపిస్తాడు. రోజున వెలుగులు కురిపిస్తాడు. భూమి చుట్టూ తిరుగుతుంటాడు. భూమికి నమ్మకమైన మేనమామగా వినతికి ఎక్కాడు. అలాంటి చంద్రుడి లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎన్నో గుట్టుమట్లు ఉన్నాయి. వాటిని చేదించడానికే ఇస్రో చంద్రయాన్_1,2,3 ప్రయోగించింది ప్రయోగించింది. ఇందులో చంద్రయాన్_2 ప్రయోగం విఫలమైనప్పటికీ ఇస్రో గొప్ప గొప్ప ప్రయోగాలు చేసేందుకు నాంది పలికింది.

తాజాగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగింది. ప్రజ్జాన్, విక్రమ్ కలయికల లాండర్, రోవర్ పని చేయడం ప్రారంభమైంది. చంద్రుడికి సంబంధించిన అనేక విషయాలను ఇస్రో తెలుసుకోవడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు ఊహించింది ఒకటైతే.. అవి పంపిస్తున్న సమాచారం మరో విధంగా ఉంది. ఎందుకంటే చంద్రయాన్_1 ప్రయోగం ద్వారా జాబిల్లి మీద నీటి జాడలు కనుక్కున్న ఇస్రో.. ఆ దిశగా మరిన్ని విషయాలు కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే శాస్త్రవేత్తలు అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రుడు తన అసలు రూపాన్ని ప్రదర్శించడం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే మొన్నటిదాకా మీద నీటి జాడలు ఉన్నాయి కాబట్టి మానవ నివాసయోగ్యంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ చంద్రుడు విసురుతున్న సవాళ్లు మామూలుగా లేవు. అక్కడి వాతావరణ పరిస్థితులను చూసి శాస్త్రవేత్తలకు మతి పోయినంత పని అవుతోంది.

చంద్రయాన్ _3 లోని లాండర్లోని పేలోడ్ చంద్రుడి ఉపరితలం, కాస్త లోతులో సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలు ప్రకారం ఆసక్తికర విషయం తెలిసింది. చంద్రుడి ఉపరితలంపై 50 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే కేవలం ఎనిమిది సెంటీమీటర్ల లోతుకి వెళ్లగానే అది మైనస్ 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకి వెళ్తే మంచు ఆనవాళ్లు కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పరిశోధన ఆధారంగా ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారిపోతాయని అర్థమవుతున్నది. చంద్రయాన్ 2 ప్రయోగించినప్పుడు సూర్యుడి లేలేత కిరణాలు ప్రకటించగానే చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. దీనివల్ల అప్పుడు పంపిన లాండర్ విక్రమ్ పనిచేయడం ఆగిపోయింది. ఇదే తీరుగా అది పంపిన సంకేతాల ఆధారంగా శాస్త్రవేత్తలు పరిశీలిస్తే రాత్రి సమయానికి చంద్రుడిపై ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయింది. అయితే ఇటువంటి వాతావరణం దక్షిణ ధ్రువం మీద ఉండదని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం దక్షిణ దృవం మీద చంద్రయాన్ 3 దిగి పరిశోధనలు జరుపుతున్న నేపథ్యంలో అక్కడి ఉష్ణోగ్రతలు శాస్త్రవేత్తలను ఒకింత షాక్ కు గురిచేస్తున్నాయి. దీని ప్రకారం భూమి లాగా చంద్ర మండలం మనుషుల నివాసానికి అంత యోగ్యం కాదని తెలుస్తోంది.

Recommended Video:

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular