Budget 2024 Expectations: మరో కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు.. ఇప్పటికే బీజేపీ రెండు సార్లు అధికారంలో ఉంది. మూడవసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఎలాగూ అయోధ్య రామ మందిరం కలసాకారమైంది. రామ మందిరాన్ని ప్రారంభించిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సోలార్ పథకానికి శ్రీకారం చుట్టారు. అంటే తమ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కూడా ప్రజలపై మరిన్ని సంక్షేమ వరాలు ప్రకటిస్తుందని చెప్పకనే చెప్పారు. ఎలాగూ ఎన్నికల బడ్జెట్ కాబట్టి ప్రజలపై భారం వేయరని.. ఓటర్లను ఆకట్టుకునే విధంగా సంక్షేమ పథాన్ని అనుసరిస్తారు.. రాయితీలు కల్పిస్తారని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నప్పటికీ.. ఎక్కడో ఒక మూల సంశయం.. ఎందుకంటే మధ్య అసియాలో యుద్ధ వాతావరణం.. యూరప్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు.. పైగా గత ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వలేదు. పద్యంలో ఈసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అందరి దృష్టి నెలకొంది.
బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి పలు విజ్ఞప్తులు, డిమాండ్లు, ప్రతిపాదనలు వస్తున్నాయి. ముఖ్యంగా రత్నాలు_ ఆభరణాల ఎగుమతి, ప్రోత్సాహక మండలి, బంగారం, కట్ చేసిన, తానబెట్టిన వజ్రాలపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. బంగారం, వెండి, వజ్రాలు, రంగురాళ్ల వంటి రా మెటీరియల్ దిగుమతి మీదే దేశీయ రత్నాలు, నగల పరిశ్రమ ఆధారపడి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో తాము సత్తా చాటాలి అంటే మాత్రం సుంకాలు తగ్గించాలని.. అంతర్జాతీయంగా ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తమకు రాయితీలు కల్పించాలని ఈ రంగం కోరుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్ట నున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగానికి సంబంధించిన వారు పలు విజ్ఞప్తులను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
మనదేశంలో ఆభరణాల పరిశ్రమ దాదాపు దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. మన దేశంలో అంతగా బంగారం లభ్యం కాకపోవడం, అంతర్జాతీయంగా బంగారం ముడి సరుకు ధరలు పెరగడం, అమెరికన్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తరచూ పెంచడంతో ఈ పరిశ్రమ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. అయితే ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న విలువైన లోహాలపై ప్రస్తుతం ప్రభుత్వం 15% సుంకం విధిస్తోంది. అయితే దీనిని నాలుగు శాతానికి తగ్గించాలని బంగారు వర్తక పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతోంది. అలాగే కట్_ పాలిష్డ్ డైమండ్స్ పై కూడా ఐదు నుంచి 2.5 శాతానికి కష్టం సుంకాన్ని తగ్గించాలని కోరుతూ ఉంది. అధిక సుంకం వల్ల తాము మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయలేకపోతున్నామని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అధిక సుంకం వల్ల దేశంగా ఎగుమతులు కూడా తగ్గిపోతున్నాయని, ఉద్యోగ_ కల్పన కూడా చేయలేకపోతున్నామని.. అవి జోరందుకోవాలంటే సుంకాన్ని తగ్గించడం ఒకటే మార్గం అని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చైనా, థాయ్ లాండ్ దేశాల నుంచి తమకు పోటీ ఉందని.. దానిని తట్టుకొని నిలబడాలంటే సుంకాలు తగ్గించాలని బంగారు వర్తక పరిశ్రమ కోరుతోంది.. సూక్ష్మ, చిన్న, తరహా డైమండ్ ఎగుమతిదారులకు డైమండ్ ఇంప్రెస్డ్ లైసెన్స్ విధానాన్ని పున: ప్రారంభించాలని బంగారు వర్తక పరిశ్రమ కోరుతోంది. స్పెషల్ నోటిఫైడ్ ప్రాంతాలలో ముడి వజ్రాల అమ్మకాన్ని అనుమతించాలని డిమాండ్ చేస్తున్నది.
ఇక విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న కాగితానికి సంబంధించిన ఉత్పత్తులపై సుఖాన్ని 25 శాతానికి పెంచాలని భారతీయ పేపర్, పేపర్ బోర్డు పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నాయి.. దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం వల్ల ఇతర దేశాల నుంచి నాసిరకమైన పేపర్ ఉత్పత్తులు వస్తున్నాయని, దీనివల్ల దేశీయ కంపెనీలు తయారుచేసిన పేపర్ ఉత్పత్తులు అమ్ముడు పోవడం లేదని ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమస్యకు కేంద్రం పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేస్తోంది. రాబోయే బడ్జెట్లో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచాలని కోరుతూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు పేపర్, పేపర్ బోర్డు దిగుమతులు 43% పెరిగాయని.. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 25% మాత్రమే దిగుమతులు ఉన్నాయని ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చెబుతోంది. కాబట్టి దిగుమతి సుంకాలు పెరగాల్సిన అవసరం ఉందని.. అప్పుడే దేశీయంగా కాగితపు పరిశ్రమ బలపడుతుందని
ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంటున్నది.