Boyapati Srinu: మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఒకే ఒక తెలుగు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఒక సినిమాని ప్రేక్షకుడికి నచ్చేలా మాస్ అంశాలను జోడిస్తూ ఎలా తీయాలి అనే విషయం లో ఈయన పీహెచ్డీ చేశాడనే చెప్పాలి. ఇక ఫైట్ల విషయంలో అయితే ఆయన ఎక్కడ తగ్గకుండా తన హీరోతో భారీ ఫైట్లు చేయిస్తాడు. ఇక వేళ తన హీరో కి ఫైట్ షూట్ లో గాయాలు అయితే తనే వచ్చి డూప్ గా కూడా చేస్తాడు అనే విషయం రీసెంట్ గా స్కంద సినిమాలో మనం చూశాం. రామ్ కాలికి గాయం అవ్వడంతో బోయపాటి తనకి డూప్ గా చేశాడు ఆ వీడియో కూడా నెట్ లో తెగ వైరల్ అయింది.
ఇక ఇది ఇలా ఉంటే బోయపాటి తీసిన సినిమాల్లో ఎవర్ గ్రీన్ సినిమా ఏదైనా ఉంది అంటే అది రవితేజ హీరోగా చేసిన భద్ర సినిమా అనే చెప్పాలి…ఇక ఈ సినిమా తీస్తున్న సమయంలో ఈ సినిమాకి బోయపాటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి పని చేశాడు. అయితే ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మించాడు.ఇక ఈ సినిమా బోయపాటి శ్రీనుకి దర్శకుడి గా మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఇది ఇలా ఉంటే అప్పటికే వంశీ పైడిపల్లి దిల్ రాజుకి మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది. దిల్ రాజు సినిమాలకు కావాల్సిన ఫైనాన్స్ మొత్తాన్ని వంశీ పైడిపల్లి చూసుకునేవాడట. దాంతో వంశీ పైడిపల్లి దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమాకి డైరెక్షన్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు.
కానీ సినిమా తీసే ముందు ఆయనకి దర్శకత్వ విభాగంలో కొంచెం నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశ్యం తో భద్ర సినిమాకి బోయపాటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయమని దిల్ రాజు చెప్పాడట. అలా వంశీ భద్ర షూటింగ్ సెట్ కి వచ్చి షూటింగ్ చూస్తు డైరెక్షన్ ఎలా చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసేవాడట. ఇలా జరుగుతున్న క్రమం లో బోయపాటి ఒకరోజు ఒక సీన్ తెరకెక్కిస్తున్నప్పుడు ఆ షాట్ ఓకే అయిందని మానిటర్ లో చూసి చెప్పాడట అది చూసిన వంశీ పైడిపల్లి మాత్రం ఆ సీన్ అంత బాగా లేదు. ఇంకొక టేక్ చేయండి అని చెప్పాడట దాంతో అప్పుడు కోపానికి వచ్చిన బోయపాటి డైరెక్టర్ నువ్వా నేనా అని వంశీతో గొడవకి దిగినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.
ఇక ఇద్దరి మధ్యలోకి దిల్ రాజు వచ్చి అప్పటి వరకు జరిగిన ఆ చిన్నపాటి గొడవని సద్దుమణగ కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇక బోయపాటి కూడా దిల్ రాజుతో వంశీ నా సినిమాలు మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆయన దూకుడు తగ్గించుకుంటే నా సినిమా నేను చేసుకుంటాను అని చెప్పి అతన్ని కొంతవరకు కంట్రోల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే బోయపాటి తన మేకింగ్ స్టైల్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేయడం తో భద్ర సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత అంత మంచి స్టోరీ తో ఆయన ఇప్పటివరకు సినిమా చేయలేదు అనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది కి భద్ర సినిమా ఫేవరెట్ గా నిలిచింది అంటే దానికి ఆ సినిమాలో ఉన్న మేకింగే ముఖ్య కారణం అని చెప్పాలి. ఇక దాంతో పాటుగా ఆ సినిమా కథ కూడా చాలా ఫ్రెష్ గా ఉండడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇది ఒక క్లాసికల్ సినిమా గా నిలిచి పోయింది…