Chandrayaan 3 : చంద్రయాన్_2 విఫలమైన తర్వాత ఇస్రో చేపట్టిన చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతమైంది. ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో జాబిల్లి దక్షిణ ధ్రువం మీద భారత్ జెండా పాతింది. ఇతర దేశాలకు సాధ్యం కాని రికార్డును సృష్టించింది. చంద్రయాన్_3 సగర్వంగా జాబిల్లి మీద అడుగు పెట్టింది.40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇస్రో అనుకున్న లక్ష్యాలను విక్రమ్ సాధించింది. సరే ఈ విజయం పూర్తయిన తర్వాత.. తదుపరి ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
WOW 🤩😲😍
Historic video of #PragyanRover coming out of #VikramLander of ISRO to walk on Moon 🌖
Biggest day in history of India 🥺😘 pic.twitter.com/6LNM0I1jw1
— Vivek Singh (@VivekSi85847001) August 23, 2023
కొన్ని గంటల్లో..
కొన్ని గంటల తర్వాత ల్యాండర్లోని రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత కూడా ల్యాండర్ నుంచి రోవర్ ఎందుకు బయటకు రాదంటే పది మీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ కిందికి జారి పడినప్పుడు.. ఆ తాకిడికి పైకి లేచిన చంద్రధూళి సర్దుకోవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అంతా మొత్తం సద్దుమణిగిన తర్వాత ల్యాండర్లోని రోవర్ బయటకు వస్తుంది. అప్పుడు ఆ రెండూ పరస్పరం ఫోటోలు తీసుకొని భూమికి పంపుతాయి. ఆ రెండూ సురక్షితంగా ఉన్నాయి అనడానికి ఆ ఫోటోలే నిదర్శనం. దీంతో చంద్రయాన్_3 పూర్తిగా విజయవంతమైనట్టు లెక్క.
BREAKING 🔥🔥🔥#PragyanRover has now completely rolled out successfully from ISRO #VikramLander completing the full process of #Chandrayaan3 mission.
What a beautiful Process ⚡🇮🇳 pic.twitter.com/XJATs0DE4O
— Vivek Singh (@VivekSi85847001) August 23, 2023
615 కోట్ల ఖర్చు
చంద్రయాన్_3 కోసం ఇస్రో 615 కోట్లు ఖర్చు చేసింది. 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. జాబిల్లి మీద చంద్రయాన్_3 దిగింది. చంద్రుడి ఉపరితలాన్ని చంద్రయాన్_3 క్షుణ్ణంగా పరిశీలించింది. చంద్రుడి నిర్మాణం, పరిమాణం, వాతావరణం మీద అధ్యయనం చేయనుంది. 14 రోజులపాటు చంద్రుడి మీద “రోవర్ ప్రజ్ఞాన్ ” పరిశోధనలు చేస్తుంది. ఇలా అనేక ఘనతలు సాధించిన ఇస్రో చంద్రుడి దక్షిణ దృవం మీద తొలిసారిగా మూడు రంగుల జెండా పాతి చరిత్ర సృష్టించింది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువం పై ల్యాండింగ్ లో రష్యా లూనా విఫలమైంది. చంద్రుడి మీద ఇప్పటివరకు 12 దేశాల నుంచి 141 ప్రయత్నాలు జరిగాయి. కాగా భారత్ నుంచి మూడు ప్రయత్నాలు జరగగా, రెండు విజయవంతమయ్యాయి.
కారణమదే
ఇస్రో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్టు గుర్తించడమే. ఆ ప్రాంతంలో నీరు మంచు స్పటికాల రూపంలో ఉందని నాసా కూడా గుర్తించింది. ఎంత లేదనుకున్న అక్కడ పది కోట్ల టన్నుల మీద నీటి నిల్వలు ఉన్నాయని నాసా అంచనా వేస్తోంది. నీరు పుష్కలంగా ఉన్నచోట మనిషి జీవించగలడు కాబట్టి.. భవిష్యత్తు కాలంలో చంద్రుడు మీద పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చంద్రుడి మీద రాళ్లు, శిలలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. ల్యాండర్ దిగేందుకు కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇక ఇస్రో అంచనా వేసినట్టుగానే ల్యాండర్ సురక్షితంగా దిగి చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టింది. అయితే ఇక్కడ విలువైన ఖనిజాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా నీటి, ఇతర ఖనిజాల అన్వేషణను చంద్రయాన్_3 నిర్వహిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Chandrayaan-3 Mission:
The image captured by the
Landing Imager Camera
after the landing.It shows a portion of Chandrayaan-3's landing site. Seen also is a leg and its accompanying shadow.
Chandrayaan-3 chose a relatively flat region on the lunar surface 🙂… pic.twitter.com/xi7RVz5UvW
— ISRO (@isro) August 23, 2023