https://oktelugu.com/

వరదసాయం చేసినా బురదే మిగిలిందా? 

దుబ్బాకలో ఓటమి గ్రేటర్ పై ప్రభావం చూపదని ధీమాగా ముందుకెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైదరాబాదీలు షాక్ ఇచ్చారు. గులాబీ దళానికి వరుస ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలేం జరిగింది? ఎక్కడ ఓడిపోయామనే దానిపై సీఎం కేసీఆర్ పోస్టుమార్టం చేసినట్టు తెలిసింది. వరదసాయం కింద రూ.10వేల చొప్పున సాయం చేసినా టీఆర్ఎస్ కు చివరకు బురదే మిగిలింది.. ఓటమికి కారణాలపై గులాబీ దళపతి తాజాగా శూలశోధన మొదలుపెట్టినట్టు తెలిసింది. Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలపై యోగీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2020 / 01:45 PM IST
    Follow us on

    దుబ్బాకలో ఓటమి గ్రేటర్ పై ప్రభావం చూపదని ధీమాగా ముందుకెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైదరాబాదీలు షాక్ ఇచ్చారు. గులాబీ దళానికి వరుస ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలేం జరిగింది? ఎక్కడ ఓడిపోయామనే దానిపై సీఎం కేసీఆర్ పోస్టుమార్టం చేసినట్టు తెలిసింది. వరదసాయం కింద రూ.10వేల చొప్పున సాయం చేసినా టీఆర్ఎస్ కు చివరకు బురదే మిగిలింది.. ఓటమికి కారణాలపై గులాబీ దళపతి తాజాగా శూలశోధన మొదలుపెట్టినట్టు తెలిసింది.

    Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలపై యోగీ ఆసక్తికర ట్వీట్..!

    కేసీఆర్ ఆరేళ్ల పాలనకు జీహెచ్ఎంసీ ఎన్నికు రెఫరెండంగా మారాయన్న చర్చ సాగుతోంది. 2019లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. ఇదంతా మోడీ హవా అనుకున్నారు. కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో ఇప్పుడు బీజేపీని గుర్తించాల్సిన పరిస్థితి కేసీఆర్, కేటీఆర్ కు ఏర్పడింది.

    జీహెచ్ఎంసీలో ఓటమికి ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదనే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అడగకున్నా ఇంటికి రూ.10వేల సాయం ప్రకటించిన కేసీఆర్ దాన్ని సమయానికి అందివ్వడంలో విఫమయ్యాడు. ఎన్నికల కోడ్ తో నిలిచిపోవడం పెద్ద దెబ్బగా పరిణమించింది. హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసినా అదంతా హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోయింది. గులాబీ నేతల చేతివాటం దెబ్బతీసింది.

    Also Read: గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ పోస్టుమార్టం.. చివరకు తేలిందెంటీ?

    ఇక ఇటీవల కేసీఆర్ సర్కార్ తెచ్చిన ఎల్ఆర్ఎస్ పథకం కూడా అధికార పార్టీ కొంప ముంచినట్టు తెలుస్తోంది. ఇక ప్రచారంలో టీఆర్ఎస్ కు ఎంఐఎంతో లింక్ పెట్టి సర్జికల్ స్ట్రైక్ అంటూ బీజేపీ వ్యాఖ్యలు బీజేపీకే ప్లస్ కాగా.. టీఆర్ఎస్ కు నష్టం చేకూర్చాయని అంటున్నారు.

    ప్రస్తుతం పరిస్థితి చూస్తే తెలంగాణలో బీజేపీ వేవ్ మొదలైనట్టే కనిపిస్తోంది. బీజేపీని లైట్ తీసుకుంటే మొదటికే మోసం.. ఎల్బీనగర్, ముషీరాబాద్, ఉప్పల్ లాంటి చోట్ల టీఆర్ఎస్ కు భారీ దెబ్బపడింది. ఈ క్రమంలోనే ఇక జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే పట్టభద్రులు, నాగార్జున సాగర్ ఎన్నికలు ఇప్పుడు టీఆర్ఎస్ కు పరీక్షగా మారనున్నాయి. బల్దియా ఓటమిపై టీఆర్ఎస్ పోస్టుమార్టం నేపథ్యంలో కేసీఆర్ మరింత జాగ్రత్తగా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్