జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో ఏ పార్టీకీ అవసరమైన మెజార్టీ రాని పక్షంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై నేతలు సమాలోచనలు […]
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో ఏ పార్టీకీ అవసరమైన మెజార్టీ రాని పక్షంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై నేతలు సమాలోచనలు జరుపుతున్నారు.