https://oktelugu.com/

‘బిగ్ బాస్’ను నడిపిస్తున్న తెలుగు సెలబ్రెటీ ఎవరంటే?

దేశంలోని ప్రముఖ భాషల్లో ‘బిగ్ బాస్’ రియల్టీ షో నడుస్తోంది. అన్ని భాషల్లో కంటే తెలుగులోనే బిగ్ బాస్ కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో కరోనా టైంలోనూ బిగ్ బాస్-4 తెలుగు సీజన్ ను నిర్వాహకులు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ గేమ్ చివరి అంకానికి చేరుకోవడంతో టైటిల్ విన్నర్ ఎవరా? అనే చర్చ అభిమానుల్లో నడుస్తోంది. ఇక దీంతోపాటు బిగ్ బాస్ ను ఎవరు నడిపిస్తున్నారనేది తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 02:59 PM IST
    Follow us on

    దేశంలోని ప్రముఖ భాషల్లో ‘బిగ్ బాస్’ రియల్టీ షో నడుస్తోంది. అన్ని భాషల్లో కంటే తెలుగులోనే బిగ్ బాస్ కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో కరోనా టైంలోనూ బిగ్ బాస్-4 తెలుగు సీజన్ ను నిర్వాహకులు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ గేమ్ చివరి అంకానికి చేరుకోవడంతో టైటిల్ విన్నర్ ఎవరా? అనే చర్చ అభిమానుల్లో నడుస్తోంది. ఇక దీంతోపాటు బిగ్ బాస్ ను ఎవరు నడిపిస్తున్నారనేది తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.

    Also Read: బిగ్ బాస్-4: నాగార్జున అండతో ఆమె టైటిల్ విన్నర్ అవుతుందా?

    ప్రస్తుతం ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గానే కొనసాగుతున్నారు. అభిజిత్.. హరిక.. అరియానా.. అఖిల్.. సొహెల్.. మొనాల్.. అవినాష్ ఎవరికీ వారు టైటిల్ ఫేవరేట్లుగా నిలుస్తున్నారు. వీరిలో అభిజిత్.. అరియానా టైటిల్ ఫేవరేట్లుగా కన్పిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ టీంను నడిస్తున్నది తెలుగు సెలబ్రెటీనే అనే లీకులు రావడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

    బిగ్ బాస్ కాన్సెస్ట్ అనేది విదేశీయులదే అయినా ప్రాంతీయ భాషల్లో మాత్రం స్థానికులే అన్ని పనులు చూస్తుంటారు. దీనిలో భాగంగా కంటెస్టెంట్స్ ఎంపిక.. వారితో కాంట్రాక్టులు కుదుర్చడం.. వారికి నిబంధనలు అర్థమయ్యేలా చెప్పటం వంటి పనులు చేస్తుంటారు. ఈ వివరాలన్నింటి బిగ్ బాస్ నిర్వాహాకులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే అనుహ్యంగా బిగ్ బాస్ టీంను నడిస్తుంది ఎవరో అక్కినేని సమంత బయట పెట్టేసింది.

    బిగ్ బాస్-4 సీజన్లో దసరా సందర్భంగా నాగార్జున ప్లేసులో సమంత హోస్ట్ గా చేసింది. సమంత ఎసిపోడ్ మంచి టీఆర్పీనే దక్కింది. ఈ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో బిగ్ బాస్ టీంకు కృతజ్ఞతలు చెప్పింది. ఈక్రమంలోనే బిగ్ బాస్ టీంను నడిపిస్తున్న తెలుగు సెలబ్రెటీ పేరు వెల్లడించి నిర్వహాకులకు షాకిచ్చింది.

    Also Read: ‘ఆదిపురుష్’లో కాస్ట్ కటింగ్.. మూవీపై ఎఫెక్ట్ పడుతుందా?

    ఆయనే పేరు జీకే మోహన్. ఇతను ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆయన టీవీ మీడియాలో ఒక దిగ్గజమని పలువురు చెబుతుంటారు. నాటి దూరదర్మన్ రోజుల నుంచి ఆయన అనేక టీవీ ఛానల్లో పని చేశారు. తెలుగు సీరియల్స్, రియాలిటీ షోల వెనక ఈయనే ఉంటారని సమాచారం.

    జీకే మోహన్ వద్ద ప్రముఖ యాంకర్లు అయిన సుమ.. అనితా చౌదరి..ఝాన్సీలు దూరదర్శన్ రోజులనుంచి ఆయన దగ్గర పని చేశారాట. జెమినిలో ‘చెప్పుకోండి చూద్దాం’ వంటి రియల్టీ షోతోపాటు పలు షోలకు ఆయన రూపలక్పన చేశారు. ఆయనకు కాన్సెప్ట్స్ పేరుతో సొంత టీవీ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. జెమిని కిరణ్‌కు జీకే మోహన్ అత్యంత సన్నిహితులట. ఇక మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత టీమ్ ను కూడా జీకే మోహన్ మానిటరింగ్ చేస్తారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్