తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ బిగ్ బాస్ నిర్వాహాకులు నాలుగో సీజన్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే నిర్వహించేందుకు బిగ్ బాస్ ఏర్పాట్లు చేస్తున్నాడు. దీంతో టైటిల్ విన్నర్ ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: బిగ్ బాస్-4: నాగార్జునను ట్రోల్ చేస్తున్న అభిఫ్యాన్స్.. ఎందుకంటే?
బిగ్ బాస్-4 ప్రస్తుతం 12వారం పూర్తి చేసుకొని 13వ వారంలోకి అడుగుపెట్టబోతుంది. హౌస్ లో ప్రస్తుతం దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అభిజిత్.. అఖిల్.. అరియానా.. అవినాష్ ఉన్నారు. ఈ ఏడుగురిలో నుంచి నేడు ఒకరి ఎలిమినేషన్ కానున్నారు. మిగిలిన వారిలో ఒకరు టైటిల్ విన్నర్ కానుండటంతో ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
12వ వారం మొదటి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు షాకులు మీద షాకులిస్తున్నాడు. ఈ వారం టాస్కును అవినాష్ గెలుచుకోవడంతో అతడికి వచ్చేవారం ఇమ్యూనిటీ దక్కించింది. అయితే అతడు ఈవారం ఎలిమినేషన్ తప్పించుకుంటేనే అతడికి 13వ వారంలో ఇమ్యూనిటీ లభించనుంది. ఇక మొనాల్ గజ్జర్ తొలుత నామినేట్ నుంచి తప్పించుకున్నా అనుహ్యంగా కెప్టెన్ హారిక కారణంగా నామినేషన్ కు వెళ్లాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో అభిజిత్ టాస్కుల్లో ప్రతిభ చూపకపోయినా ప్రస్తుతానికైతే అతడే టైటిల్ ఫేవరేట్ ఉన్నాడు. అభిజిత్ ఇప్పటికే ఎనిమిది సార్లు నామినేట్ అయిన సేఫ్ అయ్యాడు. దీంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఏర్పడింది. సోషల్ మీడియాలో అతడి పేరిట ట్రెండ్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే హోస్ట్ నాగార్జున మాత్రం అరియానాకు సపోర్టు చేస్తున్నాడు. దీంతో అనుహ్యంగా టైటిల్ రేసులో ఆమె పేరు తెరపైకి వస్తోంది.
Also Read: ‘ఆదిపురుష్’లో కాస్ట్ కటింగ్.. మూవీపై ఎఫెక్ట్ పడుతుందా?
బిగ్ బాస్ మూడు సీజన్లోనూ మగ కంటెస్టెంట్సే విన్నర్ గా నిలిచారు. మొదటి సీజన్ కు శివబాలాజీ.. రెండో సీజన్లో కౌశల్ మండా.. మూడో సీజన్లో రాహుల్ సింప్లిగంజ్ విన్నర్ గా నిలిచారు. రెండో సీజన్లో గీత మాధురి.. మూడో సీజన్లో శ్రీముఖి రన్నర్ గా నిలిచారు. ఇక నాలుగో సీజన్లో లేడి కంటెస్టెంట్ ను బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.
ఈక్రమంలోనే అరియానా గ్లోరీకి హోస్టు నాగార్జున సపోర్టు చేస్తున్నట్లు టాక్ విన్పిస్తోంది. అరియానా కూడా బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో మంచి ప్రతిభను కనబరుస్తూ విజేతగా నిలుస్తుంది. బిగ్ బాస్ లో వందశాతం నిజాయితీతో ఆడుతున్న కంటెస్టెంట్ గా అరియానా గుర్తింపు తెచ్చుకుంది. నాగార్జున కూడా ఆమెకు సపోర్టు చేస్తుండటంతో అరియానా టైటిల్ రేసులోకి దూసుకొచ్చింది. ఈసారైనా లేడి కంటెస్టెంట్ విన్నర్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే..!
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్