వాట్సాప్ యాప్ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.?

దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ పాత ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ వాడేవాళ్లకు వాట్సాప్ భారీ షాక్ ఇచ్చింది. మెరుగైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తోన్న వాట్సాప్ వ్య‌క్తిగ‌త గోప్య‌త కోసం ఇప్ప‌టికే ఎన్‌క్రిప్టెడ్ చాటింగ్ ను అందుబాటులోకి తీసుకురాగా మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో పాత ఫోన్లలో సర్వీసులను నిలిపివేయాలని వాట్సాప్ భావిస్తోంది. Also Read: స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్నారా.. ఎలా కనిపెట్టాలంటే..? ప్ర‌స్తుతం ఐఓఎస్‌లో వాట్సాప్ […]

Written By: Kusuma Aggunna, Updated On : March 20, 2021 10:53 am
Follow us on

దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ పాత ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ వాడేవాళ్లకు వాట్సాప్ భారీ షాక్ ఇచ్చింది. మెరుగైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తోన్న వాట్సాప్ వ్య‌క్తిగ‌త గోప్య‌త కోసం ఇప్ప‌టికే ఎన్‌క్రిప్టెడ్ చాటింగ్ ను అందుబాటులోకి తీసుకురాగా మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో పాత ఫోన్లలో సర్వీసులను నిలిపివేయాలని వాట్సాప్ భావిస్తోంది.

Also Read: స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్నారా.. ఎలా కనిపెట్టాలంటే..?

ప్ర‌స్తుతం ఐఓఎస్‌లో వాట్సాప్ 2.21.50 వెర్ష‌న్ అందుబాటులో ఉండగా ఐఫోన్ 4s తర్వాత మోడల్స్ ను వినియోగిస్తున్న వాళ్లు మాత్రమే వాట్సాప్ యాప్ ను వినియోగించగలరు. ఐఫోన్ 5 తర్వాత మోడల్స్ ఉపయోగిస్తే మాత్రం ఐఓఎస్‌10కు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సర్వీసులను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్‌ వాడేవాళ్లు 4.0.3 ఓఎస్ కంటే ముందు ఓఎస్ ను వాడినా వాట్సాప్ యాప్ పని చేయదు.

Also Read: ఆధార్ లోని అడ్రస్ ను సులువుగా ఎలా మార్చాలంటే..?

ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 అంత‌కంటే పాత వ‌ర్ష‌న్ ఓఎస్ ఉన్న ఫోన్లలో ఇకపై వాట్సాప్ యాప్ ను వినియోగించడం సాధ్యం కాదు. kaios 2.5.1 కంటే అడ్వాన్స్‌డ్ వ‌ర్ష‌న్‌ ఫోన్ల‌లో మాత్ర‌మే వాట్సాప్ యాప్ ను ఉపయోగించడం సాధ్యమవుతుంది. ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న‌ట్ల‌యితే సెట్టింగ్స్ లోకి వెళ్లి ఎబౌట్ ఫోన్‌పై క్లిక్ చేసి వాడుతున్న ఓఎస్ వెర్షన్ కు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఐ ఫోన్ ను వాడుతుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి జ‌న‌ర‌ల్‌పై క్లిక్ చేసి ఎబౌట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా ఏ వర్షన్ ఫోన్ ను వాడుతున్నామో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.