
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరగగా ఆ తరువాత కాలంలో సినిమా బడ్జెట్ 400 కోట్లకు పెరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆర్ఆర్ఆర్ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. బాహుబలితో రాజమౌళి సినిమాపై బోలెడంతా డిమాండ్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్ లో సినిమా వస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదల తేది ప్రకటించగానే హిందీ సినిమాలు కూడా వెనక్కి పోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. హిందీ‘మైదాన్’ మూవీ నిర్మాత బోనీ కపూర్ కూడా ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై అభ్యంతరం వ్యక్తం చేశాడు.
రోజురోజుకు జనాల్లో ఆర్ఆర్ఆర్ పై క్రేజ్ పెరిగిపోతోంది. దానికి తగ్గట్టుగానే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల నుంచి కూడా భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.
తాజాగా ఆర్ఆర్ఆర్ తమిళ హక్కుల కోసం భారీ మొత్తంలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే లైకా ప్రొడక్షన్స్ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ తమిళ వెర్షన్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాని కోసం ఏకంగా రూ.45 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఎన్టీఆర్, రాంచరణ్ ఎవరో తెలియకున్నా.. ఒక్క రాజమౌళి పేరుతోనే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. పబ్లిసిటీ, ఇతర ఖర్చులు కలుపుకుంటే తమిళంలో రూ.50 కోట్ల షేర్ వస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందన్నమాట..
రాజమౌళి సినిమా కావడంతో ఆయనపై నమ్మకంగా అతిపెద్ద సంస్థ లైకా ఈ సినిమా విడుదలకు భారీ రేటు పెట్టి కొన్నట్టు సమాచారం. దీంతో తమిళనాట ఈ సినిమా గ్రాండ్ హిట్ కోసం లైకా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నట్టు..పక్కా ప్రాణాళికతో వెళుతున్నట్టు సమాచారం.