
ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేయాలన్నా.. ట్రెండ్ ఫాలో అవ్వాలన్న అదీ పవన్ ఫ్యాన్స్ చేయాల్సిందే.. పవన్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఆ రోజు సోషల్ మీడియాలో ట్రెడింగ్ కావాల్సిందే.. తాజాగా పవన్ కూతురు ఆద్య పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆమె నామస్మరణతో మార్మోగిపోతోంది. ప్రస్తుతం ట్విట్టర్ ఫేస్ బుక్ లో ‘హ్యాపీ బర్త్ డే ఆద్య’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య పుట్టినరోజున ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. పవన్ కూతురు పుట్టినరోజును ఫ్యాన్స్ పండుగలా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద వేడుకగా జరుపుకుంటున్నారు.
ఆద్య ఇప్పుడు చాలా పెద్దది అయిపోయినా ఆమె ఫొటోలు అందుబాటులో లేవు. చిన్నప్పటి ఫొటోలే ఉన్నాయి.. ఇటీవల నిహారిక పెళ్లికి హాజరైన ఫొటోలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఆద్య చిన్నప్పటి ఫొటోలు. పవన్ తో ఉన్న ఫొటోలను షేర్లు చేస్తున్నారు. పవన్ కు ఆద్యతో పోలికలు చెప్పుకుంటూ హంగామా చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్-ఆద్య కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఆయన అభిమానులు ఆద్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. పవన్-రేణుదేశాయ్ తో కలిసి ఆద్య కేక్ కట్ చేయించిన ఫొటోలను అప్ లోడ్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కూతురు ఆద్య ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.