ఇండియా గెలుపునకు.. ఇంగ్లండ్ ఓటమికి మధ్య ఆ ఇద్దరు

భారత్, ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలి అరంగేట్ర మ్యాచ్ లోనే కుర్రాళ్లు కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ బాగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.  భారత బ్యాట్స్ మెన్ దంచికొట్టారు. మధ్యాహ్నం పూణేలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్‌ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ […]

Written By: NARESH, Updated On : March 25, 2021 10:22 am
Follow us on

భారత్, ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలి అరంగేట్ర మ్యాచ్ లోనే కుర్రాళ్లు కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ బాగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.  భారత బ్యాట్స్ మెన్ దంచికొట్టారు. మధ్యాహ్నం పూణేలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్‌ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ శర్మ 64 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ 56 పరుగులు చేసి ధావన్ కు సహకరించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు 18 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు తీశాడు. ఇందులో ధావన్ వికెట్ కూడా ఉంది. అయితే కేఎల్ రాహుల్ తో పాటు ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా అద్భుతంగా ఆడారు. వీరిద్దరి జోడి 43 బాల్స్ లో 62 పరుగులు సాధించారు. కృనాల్ పాండ్యా ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి కేవలం 31 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి 50 పరుగులు సాధించాడు. వేగవంతమైన తొలి ఆటగాడిగా అవతరించాడు. కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా ఇద్దరు చివరి 5 ఓవర్లలో 67 పరుగులు సాధించారు. చివరి 10 ఓవర్లలో 110 పరుగులు సాధించారు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 317 పరుగులు చేసింది.

సమాధానంగా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కూడా బాగానే ఆడుతున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన రాయ్, బెయిర్‌స్టో తొలి వికెట్‌కు కేవలం 14 ఓవర్లలో 131 పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ మినహా ప్రతి భారతీయ బౌలర్ పై ఎదురుదాడి చేసి పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రఖ్యాత ప్రసిద్ధ్ కృష్ణ ప్రమాదకరంగా ఆడిన ఓపెనర్ జాసన్ రాయ్‌ 46 (35)ను ఔట్ చేశాడు.

ప్రధీద్ కృష్ణతో ఆ తరువాత బెన్ స్టోక్స్ 1 (11) వికెట్ తీసుకున్నాడు.  ఆ తరువాత ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఎదుర్కొన్న మొదటి బంతిని కోహ్లీస్లిప్స్‌లో వదిలేయడంతో బతికిపోయాడు. ఇంగ్లండ్‌250 పరుగల లోపే ఆలౌట్ కావడంతో భారత్ విజయం సాధించింది. భారత బౌలర్లు బాగా బౌలింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని సాధించి పెట్టారు.