రానాకు గట్టి షాక్.. ‘అరణ్య’ మూవీ విషయంలో భారీ దెబ్బ

విలక్షణ నటుడు ‘రానా’ మరో విభిన్నమైన చిత్రంతో మనముందుకు వచ్చారు.తాజాగా ఆయన హీరోగా రూపొందిన ‘అరణ్య’ మూవీని ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు గ్రహీత ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ […]

Written By: NARESH, Updated On : March 24, 2021 11:15 am
Follow us on

విలక్షణ నటుడు ‘రానా’ మరో విభిన్నమైన చిత్రంతో మనముందుకు వచ్చారు.తాజాగా ఆయన హీరోగా రూపొందిన ‘అరణ్య’ మూవీని ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు గ్రహీత ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన హీరో రానా.. ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకుందామని భారీ బడ్జెట్ తో.. రెండున్నరేళ్లు కష్టపడి అడవుల్లో తిరిగి చేసిన సినిమా ‘అరణ్య’. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో హిందీతోపాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతికి బరిలోకి దిగాల్సిన ఈ మూవీని మార్చికి వాయిదా వేశారు. కరోనా తగ్గి 50శాతం అక్యూపెన్సీ తొలిగిపోయిన వేళ రిలీజ్ చేద్దామని అనుకుంటుండడగా మళ్లీ కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.

కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు.. ఈ నేపథ్యంలో 2021లో మొదటి త్రిభాష చిత్రంగా వస్తున్న ‘అరణ్య’ థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అడవిలో కొత్త ప్రాజెక్టులతో ఏనుగులకు శరాఘాతంగా మారిన పరిస్థితులను హీరో రానా ఛేధించడం.. కార్పొరేట్లను ఎదురించడం మెయిన్ థీమ్ గా ఉందని ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. రానా మేనరిజం మరియు ఆయన హావభావాలు నడక చాలా కొత్తగా ఉన్నాయి. క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే అరణ్య దక్షిణాదిన విడుదల అవుతుండగా.. హిందీ వెర్షన్ ను మాత్రం విడుదల చేయడం లేదని నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్ ’ అభిమానులకు షాకిచ్చింది. హిందీ మార్కెట్లో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా విడుదలను నిలిపివేశామని ప్రకటించింది. కానీ తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల అవుతుందని తెలిపింది.

హిందీ మార్కెట్ పెద్దది కావడం.. భారీ బడ్జెట్ మూవీ కావడంతో కరోనా వల్ల కలెక్షన్లపై ప్రభావం పడకుండా వాయిదా వేశారు. మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.