
చిత్రపురి హౌసింగ్ సొసైటీలో గురువారం హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం నాలుగు ప్యానల్స్ పోటీపడ్డాయి. వీటిలో ఇప్పటికే అధికారంలో ఉన్న వినోద్ బాల ప్యానెల్ తోపాటు సి.కల్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మన ప్యానెల్’.. ఓ.కళ్యాణ్ ప్యానెల్.. కొమర వెంకటేశ్ ప్యానెల్స్ బరిలో నిలిచాయి.
Also Read: పరుష ప్రసంగానికి కేసీఆర్ పుల్ స్టాఫ్..!! ఆ రెండు ఎన్నికల తరువాత మారిపోయాడా..?
చిత్రపురి కాలనీలో మొత్తం 4,803 ఓట్లు ఉన్నాయి. వీరంతా కూడా నిన్న ఉదయం 7గంటల నుంచే పోలింగ్ లో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. మధ్యాహ్నం సమయంలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి అరుణ తెలిపారు. ఎన్నికల ముగిశాక కౌంటింగ్ ఏర్పాట్లు చేసి ఫలితాలను వెల్లడించారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో వినోద్ బాల ప్యానెలే తిరిగి విజయం సాధించింది. ఈ ప్యానెల్ నుంచి 11 మంది అభ్యర్థులు పోటీచేయగా 10మంది గెలుపొందారు.
Also Read: పెద్దాయన సీఎం ఆశలు మాత్రం చావడం లేదుగా..!
వీరిలో వల్లభనేని అనిల్ కుమార్.. అనుముల మహనంద రెడ్డి.. అళహరి.. కాదంబరి కిరణ్.. కొంగర రామకృష్ణ ప్రసాద్.. పీఎస్ఎన్. దొర.. ప్రవీణ్ కుమార్ యాదవ్.. నిమ్మగడ్డ అనిత.. దీప్తి వాజ్ పేయి.. టి.లలితలు గెలుపొందారు. ఈ ప్యానల్లో చిల్లర వేణు ఒక్కరే ఓడిపోయాడు. అదేవిధంగా కొమర వెంకటేశ్ ప్యానెల్ నుంచి పోటీచేసిన వారిలో రఘు బత్తుల విజయం సాధించారు
చిత్రపురిలో జరిగిన ఎన్నికల ప్రచారం భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వినోద్ బాల ప్యానెల్ పై ఇటీవల ఓ.కల్యాణ్ ప్యానెల్ అనేక అవినీతి.. అక్రమాలకు పాల్పడ్డారణ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తిరిగి అదే ప్యానల్ ఘనవిజయం పొందడం గమనార్హం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్