
అఖిల్ అక్కినేని ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హిగ్దేతో చేస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పోరులో తలపడేందుకు సిద్దంగా ఉందని అన్నారు. కానీ ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి బరి నుంచి మన బ్యాచిలర్ తప్పుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బొమ్మరిల్లు బాస్కర్ దర్వకత్వంలో చిత్రీకరిస్తున్నారు. అంతేకాకకుండా గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి స్పందనే అందుకుంది.