
బబ్లీ బ్యూటీ చార్మి “నీ తోడు కావాలి” అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి ఇప్పటికీ దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా ఆమె ఏజ్ మాత్రం 32నే. హీరోయిన్ గా తొలి చిత్రం విడుదలై 19 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఏజ్ ముప్పై అంటే విశేషమే. ఇక ఛార్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్ళు అట. తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడుతూ “నీ తోడు కావాలి” సినిమా ఒప్పుకున్నప్పుడు తన వయసు కేవలం 13 ఏళ్ళు అని రాసుకొచ్చింది. కేవలం 13 ఏళ్లకే తాను కొత్త పెళ్లికూతురు పాత్రను పోషించానని ఇన్ డైరెక్ట్ గా తనకింకా నిండా ముప్ఫై రెండే అని అంటుంది చార్మి.
నలభై దాటిన అనుష్క లాంటి హీరోయిన్స్ ఇంకా హీరోయిన్ గానే కంటిన్యూ అవుతుంటే.. ఛార్మి మాత్రం పాతికేళ్లకే ఫేడ్ అవుట్ అయింది పాపం. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తీసే సినిమాలకు సంబంధించి నిర్మాణ బాధ్యతలన్నీ నిర్వహిస్తూ నిర్మాతగా కొనసాగుతోంది. అలాగే పెళ్లి కూడా లేకుండా పూరితోనే కలిసి ఉంటుందని టాక్ ఉంది. ఇక ఈ మాజీ బ్యూటీ మళ్ళీ గ్లామర్ చూపించడానికి రెడీ అవుతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మళ్ళీ నటన పై ఆసక్తి చూపిస్తోందని ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుందని తెలుస్తోంది.
ఎప్పటినుండో ఛార్మి అభిమానులు మళ్ళీ మా కోసం నటించండి అని అడుగుతున్నారట. అందుకే కనీసం తన అభిమానుల కోసమైనా ఒక వెబ్ సిరీస్ లోనైనా నటించాలని ఛార్మి ఫిక్స్ అయింది. పూరి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తోన్న రవి అనే కొత్త డైరెక్టర్ తీయనున్న వెబ్ సిరీస్ లోనే ఛార్మి నటిస్తోందట. పైగా ఈ వెబ్ సిరీస్ ను తానే ప్రొడ్యూస్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నిర్మాత అయ్యాక ‘ఛార్మి’ పూర్తిగా నటనకు దూరమైపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు నటన పై ఆసక్తి చూపిస్తోంది.