ఒకప్పుడు టాప్ హీరోలు ఏడాదికి అరడజనుకు తక్కువ కాకుండా సినిమాలు తీసేవారు. అయితే రానురాను ఆ సంఖ్య క్రమంగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుత హీరోలంతా ఏడాది ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతున్నారు. మహా అయితే మూడు అంతకమించి సినిమాలు తీయడం ఇప్పటి హీరోల వల్ల కావడం లేదు. అయితే కరోనా వీరందరిలోనూ మార్పు తీసుకొచ్చినట్లు కన్పిస్తోంది.
Also Read: ‘బిగ్ బాస్’ హోస్ట్ నాగార్జున ఎగ్జిట్.. రోజా ఇన్?
ప్రస్తుతం టాలీవుడ్లోని టాప్ హీరోలు.. యంగ్ హీరోలంతా ఇంతకముందులా నెమ్మదిగా సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదు. వీరంతా గేర్ మార్చి జెడ్ స్పీడుతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏడాదికి ఒకటి అర సినిమాలు తీసే హీరోలు సైతం ప్రస్తుతం నాలుగైదు సినిమాలకు కమిటయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే సినిమాలను తీసేందుకు యంగ్ హీరోలంతా రెడీ కావడంతో టాలీవుడ్లో సందడి మొదలైంది.
ప్రభాస్.. పవన్ కల్యాణ్.. మహేష్ బాబు.. రాంచరణ్.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా ఏడాదికి ఒకటో రెండో వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒకటి కూడా విడుదలవడం కష్టంగా మారుతోంది. ఈ ఏడాది అల్లు అర్జున్.. మహేష్ సినిమాలు తప్ప మిగతా హీరోలు సినిమాలు రానే లేదు. అయితే ఇప్పుడు మాత్రం వీరంతా కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బీజీగా మారారు. వీరితోపాటు పలువురు యంగ్ హీరోలు సైతం వరుసగా సినిమాలు చేస్తూ జోష్ చూపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలతో బీజీగా మారారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీ శరవేగంగా జరుగుతోంది. ఇక ప్రభాస్ సైతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ‘రాధేశ్యామ్’..‘ఆదిపురుష్’.. నాగ్ అశ్విన్ తో ఓ మూవీలో నటిస్తున్నాడు. అలాగే రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూనే ‘ఆచార్య’ను లైన్లో పెట్టాడు.
Also Read: దండయాత్రకు సిద్ధమైన టాలీవుడ్ టాప్ హీరోలు.!
ఎన్టీఆర్ సైతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తూనే త్రివిక్రమ్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యంగ్ హీరోలు నితిన్.. శర్వానంద్.. నాగశౌర్య హీరోలు కూడా నాలుగైదు సినిమాలతో బీజీగా మారారు. వీరి జోరు చూస్తుంటే వచ్చే ఏడాది టాప్ హీరోల దండయాత్ర కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది. కరోనా ఎఫెక్ట్ హీరోల్లో మార్పు తీసుకురావడంపై దర్శక, నిర్మాతలు ఖుషీ అవుతున్నారు.