https://oktelugu.com/

జగన్ ఇస్తానన్నా.. వాళ్లు ఇంట్రస్ట్ చూపించడం లేదట.!

ఏపీ సీఎం జగన్‌ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రతీ బీసీ కులానికి ఓ కార్పొరేషన్‌ పెడుతామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో 139 బీసీ కులాలు ఉండగా.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. ఇలా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం వల్ల స్వతంత్రంగా పనిచేయడమే కాకుండా.. ఆయా కులాలకు బెనిఫిట్స్‌ కూడా సెపరేట్‌గా ఉంటాయి. Also Read: పెద్ద స్కెచ్: జగన్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌? […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 / 12:44 PM IST
    Follow us on

    ఏపీ సీఎం జగన్‌ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రతీ బీసీ కులానికి ఓ కార్పొరేషన్‌ పెడుతామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో 139 బీసీ కులాలు ఉండగా.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. ఇలా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం వల్ల స్వతంత్రంగా పనిచేయడమే కాకుండా.. ఆయా కులాలకు బెనిఫిట్స్‌ కూడా సెపరేట్‌గా ఉంటాయి.

    Also Read: పెద్ద స్కెచ్: జగన్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌?

    ఆయా కులాల యువతకు రుణాలు దక్కడమే కాకుండా.. ఆయా పద్ధతుల్లో వారిని ఆదుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆర్థికంగానూ, సామాజికంగానూ అభివృద్ధి చేసేందుకు ఉపయోగకరంగానూ ఉంటుంది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న బీసీ కార్పొరేషన్లను సొసైటీలు, స్వచ్ఛంద సంస్థలుగా ప్రభుత్వం రిజిస్టర్ చేసింది. పేరుకు కార్పొరేషన్లు కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయసహకారాలు ఉండవన్నట్లు తెలుస్తోంది.

    ఇలా స్వచ్ఛంద సంస్థలు, సొసైటీలుగా రిజిస్టర్‌‌ చేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా డిమాండ్‌ చేసే ఆస్కారం ఉండదు. అంతేకాదు.. ఈ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటామని కూడా ప్రభుత్వం ఎక్కడా చెప్పడం లేదు. ఇప్పటివరకు ఇస్తున్న పథకాల నుంచే నిధులను ఇవ్వాలని అనుకుంటోంది. కేవలం వీటిని కార్పొరేషన్ల కింద చూపిస్తారు అంతే. ఇప్పటివరకు కులాల వారీగా సాయం అందిస్తే.. ఇప్పుడు అదే సాయాన్ని కార్పొరేషన్ల ద్వారా ఇవ్వనున్నారు.

    Also Read: జగన్ ఇస్తానన్నా.. వాళ్లు ఇంట్రస్ట్ చూపించడం లేదట.!

    అయితే.. ఈ కార్పొరేషన్ల ఏర్పాటు కేవలం పార్టీ కార్యకర్తలకు పదవులు కల్పించడానికేననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో.. పార్టీలో మొదటి నుంచి యాక్టివ్‌గా ఉన్న లీడర్లకు ఈ నామినేట్‌ పదవులు అప్పగిస్తుంటారు. అయితే.. సాధారణంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే బాగానే ఉండేది. కానీ.. ఈ ప్రభుత్వం సొసైటీలు, స్వచ్ఛంద సంస్థల పేరిట రిజిస్టర్‌‌ చేయించడంతో రేపు ఎన్నికైన అధ్యక్షుడు గానీ.. చైర్మన్‌కు గానీ ఎలాంటి జీతభత్యాలు ఉండవు. దీంతో బీసీ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారు.