హిమాలయాల్లో ముంచుకొస్తున్న ముప్పు: పట్టించుకోకపోతే పెను ప్రమాదం..

ఉత్తరాఖండ్ లోని చమోలీ ప్రాంతంలో ఇటీవల జరిగిన హిమ ప్రళయం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఇక్కడ హిమనీనదులు కరగడం వల్ల వరదలతో ఈ ప్రమాదం సంభవించింది. వందల ఏళ్ల నుంచి ఉన్న ఈ పర్వతాలు ఇలా కరగడానికి కారణం ఏంటి..? ఒక్కసారిగా పెను విపత్తు జరిగేలా హిమాలయాలు ఎందుకు కరుగుతున్నాయి..? అన్న ప్రశ్న అందరిలో మెదులుతోంది. అయితే ఇందుకు గ్లోబల్ వార్మింగ్ అని పర్యావరణ వేత్తలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా […]

Written By: NARESH, Updated On : March 7, 2021 10:31 am
Follow us on

ఉత్తరాఖండ్ లోని చమోలీ ప్రాంతంలో ఇటీవల జరిగిన హిమ ప్రళయం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఇక్కడ హిమనీనదులు కరగడం వల్ల వరదలతో ఈ ప్రమాదం సంభవించింది. వందల ఏళ్ల నుంచి ఉన్న ఈ పర్వతాలు ఇలా కరగడానికి కారణం ఏంటి..? ఒక్కసారిగా పెను విపత్తు జరిగేలా హిమాలయాలు ఎందుకు కరుగుతున్నాయి..? అన్న ప్రశ్న అందరిలో మెదులుతోంది. అయితే ఇందుకు గ్లోబల్ వార్మింగ్ అని పర్యావరణ వేత్తలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే రాను రాను మరింత పెను ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

హిమీననదులు కరిగినప్పుడు చాలా గ్లేసియర్స్ ప్రమాదకరంగా మారుతాయని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. పర్వతాలను అనుకొని ఉండే గ్లేసియర్స్ ఇవి కూలిపోవడంతో వల్ల పర్వతాలు పలుచబడే అవకాశం ఉందంటున్నారు. దీంతో పర్వతం వాలు మొత్తం కూలిపోతుంది. ఇలా జరుగుతూ పోతూ నదులు, కాలువలు విధ్వంసాన్ని సృష్టిస్తాయని, ఉత్తరాఖండ్ విషయంలో ఇదే జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హిమాలయాల్లోని హిందూ కుష్ ప్రాంతంలో 50 వేలకు పైగా హిమనీ నదులు ఉన్నాయి. వాటిలో కేవలం 39 వాటిపై మాత్రమే పరిశీలన ఉందని ఇండియిన్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ గ్లేషియాలజిస్ట్ శాస్త్రవేత్త పేర్కొన్నారు.

వాతావరణంలో మార్పుల వల్ల హిమపాతం, వర్షపాతంలో మార్పులు ఈ పర్వతాలను బలహీనపరుస్తున్నాయి. దీనికి తోడు గ్లోబల్ వార్మంగ్తో మరింత ప్రమాదకంగా మారుతున్నాయి. 2016లో టిబెట్లోని అరూ పర్వతంపై ఒక గ్లేసియర్ హఠాత్తుగా కూలిపోయింది. దీంతో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఇందులో చాలా మంది మరణించారు. అంతకుముందు 2012లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని సియాచిన్ గ్లేసియర్ దగ్గర జరిగిన ప్రమాదంలో 140 మంది మరణించారు.

1999 నుంచి 2018 వరకు కొండచరియలు విరిగిపోవడానికి హిమనీ నదాలు కరగడమే కారణమంటున్నారు.. అమెరికా జియాలాజికల్ సర్వే ప్రకారం 2009 నుంచి 2018 వరకు మొత్తం 127 కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ సర్వేలో గ్లేసియర్లు కరగడం వల్ల ముంచుకొచ్చే ప్రమాదం మొదలైందన్నారు. హిమనీ నదాలు తగ్గడానికి, కొండచరియలు పెరడానికి సంబంధం ఉందని సర్వే చేసిన వారు ప్రస్తావించారు.

కొండ చరియలపై పరిశోధనలు చేసిన నాసా హైడ్రాలాజికల్ సైన్స్ ల్యాబ్ ప్రతినిధులు మాట్లాడుతూ మొదట పర్వతాల వాలు గ్లేసియర్ల వల్ల అతుక్కుని ఉండేవన్నారు. కానీ అవి గ్లేసియర్లుగా లేవని, అందుకే, అవి అలా నిలబడి ఉన్నాయని తెలిపారు. దీంతో గ్లేసియర్లు కరిగితే కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్లేసియర్లు కరగడం, పెర్మాఫ్రాస్ట్ లోపల గడ్డకట్టిన మంచు కరగడం వల్ల కొండ వాలులో స్థిరత్వం, మూలాలు బలహీనంగా మారుతాయని హెచ్చరించారు.