NRI News : ఆస్ట్రేలియాలో విషాదం… జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి.. ఏపీలో విషాదం

ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఒకరు బాపట్లకు చెందిన చైతన్య ముప్పరాజుగా, మరొకరు ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బగా గుర్తించారు. వీరిద్దరూ స్నేహితేల అని తెలిసింది. ఇద్దరూ మరో స్నేహితుడితో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లారు. మంగళవారం ముగ్గరూ మిల్లా మిల్‌ వాటర్‌ ఫాల్స్‌ చూసేందుకు వెళ్లారు.

Written By: Raj Shekar, Updated On : July 18, 2024 4:28 pm
Follow us on

NRI News :  విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల పరంపర కొనసాగుతోంది. కొందరు దాడుల్లో మృతిచెందగా, కొందరు ప్రమాదాల్లో మృత్యువాతాపడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. కెయిర్న్స్‌ సమీపంలోని ప్రముఖ స్విమ్మింగ్‌ స్పాట్‌ మిల్లా మిల్లా జలపాతం వద్ద ఘటన జరిగింది.

ఏపీ విద్యార్థులు..
ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఒకరు బాపట్లకు చెందిన చైతన్య ముప్పరాజుగా, మరొకరు ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బగా గుర్తించారు. వీరిద్దరూ స్నేహితేల అని తెలిసింది. ఇద్దరూ మరో స్నేహితుడితో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లారు. మంగళవారం ముగ్గరూ మిల్లా మిల్‌ వాటర్‌ ఫాల్స్‌ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కాలుజారి ఒకరు జలపాతంలో పడిపోవడంతో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడబోయి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మూడో స్నేహితుడు ఒడ్డుకు చేరుకున్నాడు.

ఏపీలో విషాదం...
ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆస్ట్రేలియాలో మరణించడంతో బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విషాదం నెలకొంది. వారి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రయోజకులై వస్తారనుకున్న కొడుకులు.. విగత జీవిగా ఇంటికి వస్తున్నారన్న వార్తను తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు మృతుల మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

గత నెలలో అమెరికాలో..
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి గందే సాయిసూర్య అవినాష్‌ నెల క్రితం అమెరికాలో అనుకోకుండా జలపాతంలోకి జారిపడి మరణించాడు. అవినాష్‌ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గోపాలపురం మండలంలోని చితిలా గ్రామవాసి. న్యూయార్క్‌లోని అల్బానీలోని బార్బెర్విల్లే జలపాతం వద్ద ఈ ప్రమాదం జరిగింది. యుఎస్‌లో తన ఎంఎస్‌ చదువుతున్న అవినాష్, గతనెల 9న సెలవుల నేపథ్యంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో స్నే్నహితులతో జలపాతానికి వెళ్లాడు అక్కడ అతను మునిగిపోయాడు. అవినాష్‌ జారిపడి క్రిందికి వెళ్లినప్పుడు వారు జలపాతం దగ్గర నిలబడి ఉన్నారని అతని స్నేహితులు తెలిపారు. సహాయకులు వచే సరికి అతను చనిపోయాడు.

అజాగ్రత్తలతోనే..
వరుస ఘటనలకు విద్యార్థుల అజాగ్రత్తే కారణమని తెలుస్తోంది. దేశం కాని దేశంలో పరిచయం లేని కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా వారించేవారు లేకపోవడంతో విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ ఉన్న ప్రమాదాలను అంచనా వేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలబారిన పడుతున్నారు.