తిరుమలేశుని దర్శించుకునే బెస్ట్ టైం ఇదే

శ్రీవారి దర్శనానికి ఒకప్పుడు సుమారు 20 గంటల సమయం పట్టేది. క్యూ లైన్లో నిలుచుంటే మన స్థానం వచ్చే సరికి అలసిపోయేవాళ్లం. రూ.300 ల టికెట్ కొంటే గంటన్నర నుంచి నాలుగు గంటల సమయం అయ్యేది. మరీ తక్కువ సమయంలో కావాలంటే వీఐపీ బ్రేక్ దర్శనమే శరణ్యం. ఇందులో వెళ్తే అరగంట లోపే దర్శనం పూర్తవుతుంది. ప్రస్తుతం అందరూ వీఐపీ హోదా అనే అనుకునే సమయం వచ్చింది. పావుగంట లోపే దర్శనం అయిపోతోంది. దీంతో భక్తులు హర్షం […]

Written By: Srinivas, Updated On : May 18, 2021 12:16 pm
Follow us on


శ్రీవారి దర్శనానికి ఒకప్పుడు సుమారు 20 గంటల సమయం పట్టేది. క్యూ లైన్లో నిలుచుంటే మన స్థానం వచ్చే సరికి అలసిపోయేవాళ్లం. రూ.300 ల టికెట్ కొంటే గంటన్నర నుంచి నాలుగు గంటల సమయం అయ్యేది. మరీ తక్కువ సమయంలో కావాలంటే వీఐపీ బ్రేక్ దర్శనమే శరణ్యం. ఇందులో వెళ్తే అరగంట లోపే దర్శనం పూర్తవుతుంది. ప్రస్తుతం అందరూ వీఐపీ హోదా అనే అనుకునే సమయం వచ్చింది. పావుగంట లోపే దర్శనం అయిపోతోంది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్ కారణంగా..
కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు రావడం లేదు. దీంతో చిత్తూరు, పక్క జిల్లాల వారు మాత్రమే పరిమితంగా వస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ లేకపోవడంతో అందరూ వీఐపీ దర్శనంలోనే వెళ్తూ అరగంటలోపే బయటకు వస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు సైతం ఇదే అదనుగా భావించి దర్శనం కోసం తరలి వస్తున్నారు.

20 వేల మందికి అనుమతించినా..
ఏపీలో లాక్ డౌన్ లేదు. కేవలం కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి ఆంక్షలు లేవు. 20 వేల మంది దర్శించుకోవడానికి అనుమతి ఉన్నా రోజుకు కనీసం 5 వేల మంది మాత్రమే భక్తులు క్యూ లైన్లలో వస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలోనే అందరూ గబగబా వెళ్లిపోతున్నారు. 15 నిమిషాల్లోనే దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. శ్రీవారి దర్శనం త్వరగా పూర్తి కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయం
భక్తులు అధికంగా ఉన్న సమయంలో కాకుండా ఇలాంటి సమయాల్లో వెళ్తే త్వరగా దర్శనం చేసుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోవచ్చు. లాక్ డౌన్ విధించకపోవడంతో తిరుమలలో భక్తులు ఇంకా దర్శనానికి వస్తున్నారు. పరిమిత సంఖ్యలో భౌతిక దూరం పాటిస్తూ నిబంధనలు పట్టించుకుని శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. శీఘ్ర దర్శనం కావడంతో భక్తులు పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అని శ్రీవారి దర్శనం భక్తులకు సౌకర్యంగా ఉండడంతో పలువురు ఇదే దొరికిన సమయంగా భావిస్తున్నారు.