https://oktelugu.com/

కోవిడ్ ఫండ్ కి విరాళాలు ఇచ్చిన హీరోలు వీళ్ళే !

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సేవా కార్యక్రమాలు చేసినా ఎన్నడూ బయటకు రానివ్వరు. దాంతో రజిని పిసినారి అని ఎవరికీ సాయం చేయరని ఇలా అనేక విమర్శలు ఉన్నాయి రజిని పైనే. కానీ రజినిది గొప్ప మనసు. తాజాగా తన మంచి తనాన్ని మరోసారి నిరూపించుకున్నారు సూపర్ స్టార్. కోవిడ్‌-19పై పోరులో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. ఈ మేరకు ఈ రోజు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ను కలిసిన సూపర్ స్టార్ 50 లక్షల రూపాయల చెక్కును […]

Written By:
  • admin
  • , Updated On : May 17, 2021 5:20 pm
    Follow us on

    Rajinikanth
    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సేవా కార్యక్రమాలు చేసినా ఎన్నడూ బయటకు రానివ్వరు. దాంతో రజిని పిసినారి అని ఎవరికీ సాయం చేయరని ఇలా అనేక విమర్శలు ఉన్నాయి రజిని పైనే. కానీ రజినిది గొప్ప మనసు. తాజాగా తన మంచి తనాన్ని మరోసారి నిరూపించుకున్నారు సూపర్ స్టార్. కోవిడ్‌-19పై పోరులో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు.

    ఈ మేరకు ఈ రోజు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ను కలిసిన సూపర్ స్టార్ 50 లక్షల రూపాయల చెక్కును అందజేసి.. పేదలకు తన వంతుగా సాయం చేశారు. అయితే స్టాలిన్ – రజిని మధ్య, గతంలో అభిప్రాయబేధాలు రావడంతో.. వీరి కలయిక పై తమిళ మీడియాలో ఆసక్తి నెలకొంది. ఇక స్టాలిన్ కూడా రజినికి ఎదురెళ్లి గౌరవంగా ఆహ్వానించడం హర్షించదగ్గ విషయం.

    అయితే, మరోపక్క రజిని అభిమానులు మాత్రం.. ముఖ్యమంత్రి అవాల్సిన మా హీరో, ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ఒక రోజు అంతా ఎదురుచూడాల్సి వచ్చింది అని రజిని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా రజినీకాంత్ కరోనా బాధితులకు అండగా నిలబడ్డారు. ఇక కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో తమిళనాడులో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    అయితే ఈ కరోనా నేపథ్యంలో కోవిడ్‌ బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్‌ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడం కోసం, అలాగే ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం దాతలు ముందుకు రావాలని, కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్‌ కోరారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. వారిలో హీరో సూర్య ఫ్యామిలీ కోటి, హీరో శివకార్తికేయన్‌, రూ.25 లక్షలు, హీరో జయం రవి రూ.10 లక్షలు విరాళాలను అందించారు.