https://oktelugu.com/

కొత్త పీసీసీ చీఫ్ కు సరికొత్త సవాళ్లు.. రెడీగా ఉన్నాయా..?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కొత్త పీసీసీ ఎంపిక అనివార్యమైంది. కొత్త పీసీసీ చీఫ్ ఎన్నికయ్యే వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డినే పీసీసీ కొనసాగుతారని అధిష్టానం గతంలోనే ప్రకటించింది. Also Read: కేసీఆర్ ఏడేళ్ల పాలనపై ‘ఉత్తమ్’ సంచలన కామెంట్స్..! అయితే కొత్త టీపీసీసీ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారుతోంది. సీనియర్లంతా ఈ పదవీ కోసం పోటీపడుతుండటంతో ఎవరినీ ఎంపిక చేయాలో అధిష్టానం తేల్చుకోలేకపోతుంది. కాంగ్రెస్ సీనియర్లంతా ఎవరికీవారు లాబీయింగ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 29, 2020 / 05:19 PM IST
    Follow us on

    తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కొత్త పీసీసీ ఎంపిక అనివార్యమైంది. కొత్త పీసీసీ చీఫ్ ఎన్నికయ్యే వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డినే పీసీసీ కొనసాగుతారని అధిష్టానం గతంలోనే ప్రకటించింది.

    Also Read: కేసీఆర్ ఏడేళ్ల పాలనపై ‘ఉత్తమ్’ సంచలన కామెంట్స్..!

    అయితే కొత్త టీపీసీసీ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారుతోంది. సీనియర్లంతా ఈ పదవీ కోసం పోటీపడుతుండటంతో ఎవరినీ ఎంపిక చేయాలో అధిష్టానం తేల్చుకోలేకపోతుంది.

    కాంగ్రెస్ సీనియర్లంతా ఎవరికీవారు లాబీయింగ్ మొదలుపెట్టడంతో అధిష్టానం అభిప్రాయణ చేపట్టింది. ఈ నివేదిక ఆధారంగా పీసీసీని ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తుదిదశకు పీసీసీ ఎంపిక చేరుకుంది.

    రేపో మాపో పీసీసీ ప్రకటన రాబోతుంది.ఎవరూ పీసీసీ చీఫ్ గా ఎంపికైన వారికి మున్ముందు పెను సవాళ్లు ఎదురవడం ఖాయమనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లోనే బలంగా విన్పిస్తోంది.

    కాంగ్రెస్ లోని సీనియర్ నేతలను కలుపుకోవడం ఒక ఎత్తయితే.. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలను ఎదుర్కోవడం సవాలుగా మారనుంది.

    Also Read: కేసీఆర్ ఎఫెక్ట్.. ఏపీలో జగన్ సర్కార్ ఉద్యోగాల జాతర

    నాగార్జున్ సాగర్లో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉంది. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ శ్రేణులు కొంచెం కష్టపడితే గెలుపు నల్లేరుపై నడకే అనే టాక్ విన్పిస్తోంది. ఇది కొంచెం కొత్త టీపీసీసీ చీఫ్ కు సానుకూలంగా కన్పిస్తుంది.

    ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ కు సవాలుగా మారబోతున్నాయి. కాంగ్రెస్ ఉనికి కాపాడుకోవాలంటే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటాల్సి ఉంటుంది.

    వరంగల్లో కాంగ్రెస్ కొద్దిగా బలంగా ఉండగా.. ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ బలంగా ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. దీంతో ఈ ఎన్నికలే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కొత్త పీసీసీ చీఫ్ కు అసలైన పరీక్షగా మారనుందనే టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్