Homeఎంటర్టైన్మెంట్మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం !

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం !

Varun Tej
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే చరణ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా వరుణ్ తేజ్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో మెగా అభిమానులు షాక్ కి గురి అయ్యారు. ఈ మధ్య నిహారిక పెళ్లిలో భాగంగా వరుణ్ అందరితో సన్నిహితంగా ఉన్నాడు. మరి మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఇంకా ఎంతమందికి కరోనా సోకే అవకాశం ఉందో అందరిలో టెన్షన్ మొదలైపోయింది. ఏది ఏమైనా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సెలబ్రెటీలను కూడా వదిలిపెట్టకుండా వర్గభేదాలను కూడా చూడకుండా అది అందర్నీ కమ్మేస్తూ భయపెడుతుంది. అసలుకే పెద్దవాళ్లకు కరోనా ప్రాణ భయాన్ని కలిగిస్తోంది.

Also Read: ఐటమ్‌ సాంగ్‌తో హీటెక్కిస్తున్న మోనాల్‌

అయితే వరుణ్ తేజ్ కి కరోనా సోకినా.. ఆయన ఫ్యామిలీకి మాత్రం కరోనా సోకలేదు. తేజ్ ఇటివలే పార్టీలకి వెళ్ళి వచ్చారు. ఆక్కడ నుండి వచ్చాక ఈ రోజు టెస్ట్ చేసుకుంటే కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అసలు కరోనా లక్షణాలు కూడా పెద్దగా ఏమి లేవు అట. అయినా ఈ మధ్య కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారు తక్కువ అయినా, దాంతో భయపడుతున్న వారు మాత్రం ఎక్కువుగానే ఉన్నారు.

Also Read: 2020 ఓటిటి హిట్స్: సాలిడ్ సౌండ్ తో పేలిన చిన్న చిత్రాలు!

ఇప్పటికే రాజమౌళి అండ్ అయన ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్‌ వచ్చి తగ్గింది. అలాగే స్టార్ హీరో అర్జున్ కుమార్తె నటి ఐశ్వర్య అర్జున్ కి కూడా కోవిడ్ 19 పాజిటివ్ వచ్చి తగ్గింది. ఇలా చాలమంది ప్రముఖులకు కరోనా వచ్చి పోతుంది. ఏమైనా దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజల పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఉంటూ కరోనా పై పూర్తీ అవగాహన ఉన్న ప్రముఖులకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోన్న మాట వాస్తవం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version