spot_img
Homeఅత్యంత ప్రజాదరణTop Hit Movie: ఈ వారం విజేత ఆ సినిమానే

Top Hit Movie: ఈ వారం విజేత ఆ సినిమానే

టాలీవుడ్(Tollywood) లో ఈ నెలలో సినిమాల సందడి నెలకొంది. కరోనా తగ్గడంతో వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రధానంగా ఐదు ప్రముఖ సినిమాలు విడుదలయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మెల్లిమెల్లిగా పెద్ద సినిమాలు కూడా విడుదల చేయడానికి నిర్మాతలు సాహసం చేస్తున్నారు. ఈ నెల విడుదలైన సినిమాల్లో అతి కొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలిచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మునుపటి మాదిరిగా ప్రేక్షకులు థియేటర్లకు రాకున్నా ఉన్నంతలో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన చిత్రాలివీ

గత వారం విడుదలైన ఐదు టాప్ చిత్రాల్లో ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) సినిమా మాత్రమే హిట్ జాబితాలో చేరగా.. మిగతావన్నీ యావరేజ్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

గత వారం ‘రాజరాజచోర, ఎస్ఆర్ కళ్యాణ మండపం, పాగల్, బెల్ బాటమ్ (హిందీ) చిత్రాలు విడుదలయ్యాయి. మంచి అంచనాలతో విడుదలైన సినిమాలో రాజరాజ చోర మాత్రమే గ్రాండ్ హిట్ గా ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. ఇక బెల్ బాటమ్ మూవీ జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు ప్రశంసలు అందుకున్నా కానీ.. థియేటర్లకు జనాలను రప్పించడంలో విఫలమైందనే చెప్పాలి.

రాజ రాజ చోర చిత్రం అన్నింటికంటే అగ్రస్థానంలో నిలిచింది. శ్రీవిష్ణు నటన, హసిత్ గోలి కథనం అన్ని వర్గాల ప్రేక్షకుల, మీడియా ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాకపోవడమే మైనస్ గా మారింది. పాగల్ మూవీపై భారీ అంచనాలున్నా సినిమా చూశాక మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మూడు రోజుల తర్వాత అసలు బాక్సాఫీస్ వద్ద సందడి లేకుండా పోయింది.

సినిమాలు బాగున్నా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రావడం లేదు. కారణం దేశాన్ని చుట్టుముట్టిన మహమ్మారి భయం అని చెప్పవచ్చు. మొదటి వేవ్ ముగిసిన తర్వాత పరిస్థితి ఇలా లేదు. కానీ సెకండ్ వేవ్ షాక్ ఇప్పటికీ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తుండడంతో ఎవరూ థియేటర్లకు రావడానికి సాహసించడం లేదు. అందుకే కలెక్షన్లపై ప్రభావం పడుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Spain Royal Family

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...
Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Oktelugu Epaper