Homeఎంటర్టైన్మెంట్Evaru Meelo Koteeswarulu : చరణ్ గెలుస్తాడా ? లేదా? అనే డౌట్ అక్కర్లేదు...

Evaru Meelo Koteeswarulu : చరణ్ గెలుస్తాడా ? లేదా? అనే డౌట్ అక్కర్లేదు !

Ram Charan Evaru Meelo KoteeswaruluEvaru Meelo Koteeswarulu with Ram Charan: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (Evaru Meelo Koteeswarulu) మొదటి ఎపిసోడ్ అదిరిపోయింది. రామ్ చరణ్(Ram Charan) ఆట తీరు, ఎన్టీఆర్ (NTR) ఆటను ఆడించిన విధానం చాలా బాగుంది. ఇక సెకండ్ ఎపిసోడ్ లోనూ చరణ్ కి సులభమైన ప్రశ్నలే ఉంటాయట. చరణ్ చేత గేమ్ మొత్తం ఆడించి.. ప్రేక్షకుల్లో గేమ్ పట్ల పూర్తి అవగాహన పెంచడమే షో నిర్వాహకుల టార్గెట్,

బుల్లి తెర ప్రేక్షకులతో పాటు యావత్తు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ మొదటి ఎపిసోడ్ అదిరిపోయింది. అంచనాలను అందుకోవడంలో ఎన్టీఆర్ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పైగా రామ్ చరణ్ ఆట తీరు, ఎన్టీఆర్ ఆటను ఆడించిన విధానం చాలా బాగుంది.

ఇక వీరి కలయికలో రానున్న సెకెండ్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, మొదటి ఎపిసోడ్ లో హైలైట్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ – చరణ్ మధ్య సాగిన సంభాషణ చాలా పద్దతిగా ఉంది. ఇక ఇప్పటి వరకు చరణ్ రూ.80,000 వరకూ గెలుచుకున్నాడు.

అయితే, రామ్ చరణ్‌ ను ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు.. ఆలాగే వాటి సమాధానాలు ఏమిటో చూద్దాం.

మొదటి ప్రశ్న ; వీటిలో ‘గురువు’ అనే అర్థం కలిగిన పదం ఏది?
ఎ) ఆరోగ్య
బి) ఆచార్య
సి) ఐశ్వర్య
డి) ఆశ్చర్య

రెండో ప్రశ్న : హిందూ పురాణాలలో వీటిలో ఏది తాగటం వలన అమరత్వం వస్తుంది?
ఎ) కాలకూటం
బి) హలాహలం
సి) అమృతం
డి) నాలికము

మూడో ప్రశ్న : వీటిలో ఎస్‌ఎల్‌ఆర్‌, డీఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌స్టెంట్‌ అనేవి దేనిలో రకాలు?
ఎ) కెమెరాలు
బి) పుస్తకాలు
సి) విమానాల
డి) వజ్రాలు

నాలుగో ప్రశ్న : ఈ ఆడియో క్లిప్‌లోని గాయకుడు ఎవరు? (నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న)
ఎ) రమణ గోగుల
బి) పవన్‌ కల్యాణ్‌
సి) దేవిశ్రీ ప్రసాద్‌
డి) మణిశర్మ

ఐదవ ప్రశ్న : వీటిలో క్రికెట్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌ కానిది ఏది?
ఎ) కవర్‌ పాయింట్‌
బి) స్లిప్‌
సి) గల్లీ
డి) వింగ్‌బ్యాక్‌

ఆరో ప్రశ్న : ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం ఏ నగరంలో ఉంది?
ఎ) న్యూయార్క్‌
బి) సిడ్నీ
సి) ఆమ్‌స్టర్‌డ్యాం
డి) లండన్‌

ఏడోవ ప్రశ్న : పెటా సంస్ధ వీటిలో దేనికి సంబంధించినది?
ఎ) మహిళల భద్రత
బి) మానవ హక్కులు
సీ) జంతువుల హక్కులు
డి) శరణార్థుల హక్కులు

ఎనిమిదో ప్రశ్న : జూన్‌ 2021 నాటికి వీరిలో ఎవరి పేరుతో తెలంగాణలో ఒక జిల్లాకు పేరు పెట్టారు?
ఎ) ఏపీజే అబ్దుల్‌ కలాం
బి) ఎస్‌.రాధాకృష్ణన్‌
సి) పీవీ నరసింహారావు
డి) కుమురం భీం

అయితే పై ప్రశ్నలు అన్నిటికీ చరణ్ చాలా సులభంగా సమాధానాలు చెప్పాడు. అలాగే సెకండ్ ఎపిసోడ్ లో కూడా చరణ్ కి సులభమైన ప్రశ్నలే ఉంటాయట. చరణ్ చేత గేమ్ మొత్తం ఆడించి.. ప్రేక్షకుల్లో గేమ్ పట్ల పూర్తి అవగాహన పెంచడమే టార్గెట్ గా షో నిర్వాహకులు ప్లాన్ చేశారు. కాబట్టి.. చరణ్ గేమ్ గెలుస్తాడా ? లేదా? అనే టెన్షన్ అక్కర్లేదు.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular