2020 ఏడాది తొలినాళ్లలో దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్రం మార్చి నెల నుంచి కొన్ని నెలలపాటు లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుండటంతో క్రమంగా ఆన్ లాక్ పేరుతో ఒక్కో రంగానికి మినహాయింపు ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొచ్చింది.
Also Read: గ్రేటర్లో సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా?
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తొలినాళ్ల కంటే తగ్గుముఖం పట్టాయి. అయితే కరోనా మహ్మమ్మరి ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజలంతా ఎవరికీ వారు కరోనా తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు.. సామాజిక సంస్థలపై పెద్దఎత్తున కరోనాపై అవగాహన కల్పించారు. దీంతో ప్రజలు సైతం భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం.. చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే కరోనాతో అన్ని మతాలకు చెందిన పండుగలన్నీ వాయిదా పడిన సంగతి తెల్సిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ కొన్నిచోట్ల పండుగలు జరిగినా నామమాత్రంగానే జరిగాయి. ఇక కరోనా ఎఫెక్ట్ న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ పై కూడా పడింది.
Also Read: కల్లోల 2020: క్రిస్మస్ వేళ భయపెడుతున్న ప్రకృతి
నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక రాష్ట్రం తాజాగా బ్యాన్ విధించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ప్లేస్‌లు.. షాపింగ్ మాల్స్.. క్లబ్‌లు, రెస్టారెంట్లో ప్రజలు గుమ్మికూడాకుండా నిర్వాహకులు చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
డిసెంబర్ 30 నుంచి జనవరి 2వరకు కరోనా నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలు షేక్ హ్యాండ్స్.. కౌగింతలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కర్ణాటక బాటలోనే అన్ని రాష్ట్రాలు నడిచేలా కన్పిస్తున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్