పొట్టకూటి కోసం ఎన్ని పాత్రలైన పోషించే నటీనటులు ఉన్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ఏ పాత్రలు అయినా వారు పోషిస్తుంటారు. ఒకప్పుడు హీరోయిన్లుగా వెలుగొందిన వారు సైతం కళ తప్పి అవకాశాల కోసం ఇప్పుడు చిన్న పాత్రల్లో సైతం మెరుస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు కూడా జనం మెచ్చని పాత్రలు చేస్తూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు.
తాజాగా టబు ఓ సినిమా కోసం ఒప్పుకున్న పాత్ర గురించి ఇప్పుడు దుమారం చెలరేగింది. ఇలాంటి పాత్రలు చేయడానికి మీకు మనసెలా వచ్చిందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎంత స్టార్ హీరోయిన్ అయినా పాత్రల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని హితవు పలుకుతున్నారు.
ఒకప్పడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టబు స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.. తెలుగులోనూ ప్రముఖ హీరోలతో నటించింది. అయితే చాలా రోజుల గ్యాప్ తరువాత టబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తెలుగులో అల వైకుంఠపురంలో నటించింది. తాజాగా ఆమె ‘భూల్ భూలయ్య 2’ సినిమా కోసం సైన్ చేసింది. ఇందులో ఆమె తన కూతురి భర్తతో సంబంధం పెట్టుకునే పాత్రలో నటిస్తుండడంపై పెను దుమారం చెలరేగుతోంది.. కూతురిగా కియారా అద్వానీ, అల్లుడిగా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నారు.
ఈ సినిమా పాత్ర గురించి బయటకు రావడంతో నెటిజన్లు టబును ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమెపై ఇష్టం వచ్చనట్లు కామెంట్లు పెడుతున్నారు. స్టార్ నటి అయిన మీపై ఎంతో అభిమానం ఉందని, కానీ ఇలాంటి పాత్రల ఎంపికపై జాగ్రత్త వహించాలని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే సినిమాను సినిమాగా చూడాలని.. ఇలా అన్వయించుకోవద్దని టబు మాత్రం పాత్ర చేసేందుకే రెడీ అయిపోతోందట..