https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్ కార్పొరేషన్ లో 89 ఉద్యోగాలు..?

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థలలో ఒకటైన ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 89 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. https://fci.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 31 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 30, 2021 / 07:12 PM IST
    Follow us on

    భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థలలో ఒకటైన ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 89 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. https://fci.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 31 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

    Also Read: నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో బెల్ లో ఉద్యోగాలు..?

    మొత్తం 89 ఖాళీలలో అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ లేదా తత్సమాన పరీక్ష పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్)‌ ఉద్యోగ ఖాళీలు 27 ఉండగా కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా అగ్రిక‌ల్చ‌ర‌ల్ బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: 3479 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే..?

    28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అకౌంట్స్)‌ ఉద్యోగ ఖాళీలు 22 ఉండగా ఐసీఏఐ/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (లా) ఉద్యోగ ఖాళీలు 8 ఉండగా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి లా పాసై ఐదేళ్ల అనుభవం ఉండి 33 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

    గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పాసై ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన వాళ్లు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 ఏళ్ల లోపు వయస్సు ఉండి మూడేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.