Site icon OkTelugu

Anil Ravipudi Latest Movie 2027: ఏం ప్లానింగ్ సామీ.. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి చేసే సినిమా స్టోరీ ఇదేనా..?

Anil Ravipudi Latest Movie 2027

Anil Ravipudi Latest Movie 2027

Anil Ravipudi Latest Movie 2027: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు చాలా మంచి డిమాండ్ ఉంటుంది. రాజమౌళి ఇప్పటి వరకు వరుసగా 12 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి అపజయం ఎరుగని దర్శకుడిగా మొదటి స్థానంలో ఉండగా, తన తర్వాతి స్థానంలో అనిల్ రావిపూడి ఉన్నాడు. ఈయన వరుసగా తొమ్మిది విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి సైతం భారీ సక్సెస్ ని అందించాడు. 400 కోట్ల క్లబ్ లో మెగాస్టార్ చిరంజీవిని చేర్చిన ఘనత కూడా అనిల్ రావిపూడికే దక్కింది. ప్రస్తుతం ఆయన 2027 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా మరో సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అనిల్ తదుపరి సినిమా వెంకటేష్ తో ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ వెంకటేష్ తో పాటు ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వచ్చాయి. ఎకట్టకేలకు అందరి ఊహగానాలకు తెరదించుతూ అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ ని ఈ సినిమాలో మరో హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు.

Also Read: జగన్ కోసం రంగంలోకి ఆ ఇద్దరు!

ఈ విషయాన్ని నిన్న సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడి షేర్ చేశాడు. మొదట నన్ను 100 కోట్ల క్లబ్లో చేర్చిన వెంకటేష్, అలాగే నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన కళ్యాణ్ రామ్ ఇద్దరితో నేను సినిమా చేయబోతున్నాను అని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు…

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథ ఏమై ఉంటుందా అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందట. బావ బామ్మర్దుల మధ్య జరిగే ఒక ఎమోషనల్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది… అలాగే ఈ సినిమాలో యాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుందట. ఇక అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక రివెంజ్ డ్రామాగా తెరకెక్కబోతుందట… తన బావకు కష్టం వచ్చిందని బామ్మర్ది వచ్చి తన బావ కష్టాన్ని ఎలా తీర్చాడు. తద్వారా తన బావకి తనకి ఉన్న వైరం ఎలా తగ్గిపోయింది అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఈసారి ఫుల్ ఎమోషనల్ డ్రామా తో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో అనిల్ రావిపూడి ఉన్నాడు…

Exit mobile version