ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నివశించే ప్రజలకు బంగారం అంటే మక్కువ ఎక్కువనే సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధర తగ్గుతుండటంతో బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసేవాళ్లు కొనుగోలు చేసే సమయంలో లేదా ఇతర సమయాల్లో బంగారం అసలైందో నకిలీదో గుర్తించాలి.
Also Read: మీ ఇంట్లో పాత పేపర్లు ఉన్నాయా.. వేలు సంపాదించే ఛాన్స్..?
పొరపాటున అసలు బంగారానికి బదులుగా నకిలీ బంగారాన్ని కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. మాగ్నెట్ టెస్ట్ ద్వారా బంగారం అసలేందో కాదో సులువుగా తెలుసుకోవచ్చు. అయస్కాంతానికి బంగారం అతుక్కోదనే సంగతి తెలిసిందే. ఒకవేళ అతుక్కుంటే మాత్రం ఆ బంగారం అసలైన బంగారం కాదని గుర్తించాలి. బంగారంపై తుప్పు ఉన్నా ఆ బంగారం అసలు బంగారం కాదని గుర్తించాలి.
Also Read: భారీగా తగ్గిన బంగారం ధరలు.. మరింత తగ్గే ఛాన్స్..?
అసలు బంగారంపై బీఐఎస్ మార్క్ తప్పనిసరిగా ఉంటుంది. మనం కొనుగోలు చేసే బంగారంపై బీఐఎస్ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకుంటే ఆ బంగారం అసలు బంగారమో నకిలీ బంగారమో తెలిసే అవకాశం ఉంటుంది. బంగారం నగలను నీళ్లలో వేసిన సమయంలో నగలు మునిగిపోతే ఆ నగలు ఒరిజినల్ అని తెలుసుకోవచ్చు. నైట్రిక్ యాసిడ్, వెనిగర్ సహాయంతో కూడా సులభంగా బంగారం అసలైందో నకిలీదో తెలుసుకోవచ్చు.
బంగారాన్ని ఎప్పుడూ మంచి పేరు ఉన్న షాపులలో మాత్రమే కొనుగోలు చేస్తే మంచిది. బంగారం కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.