Site icon OkTelugu

Vishnu Vinyasam Twitter Review: ‘విష్ణు విన్యాసం ‘ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..శ్రీవిష్ణు మరో హిట్ కొట్టాడా ? లేదా?

Vishnu Vinyasam 5 Days Worldwide Collections

Vishnu Vinyasam 5 Days Worldwide Collections

Vishnu Vinyasam Twitter Review: సంక్రాంతి లాంటి భారీ సీజన్ తర్వాత మన టాలీవుడ్ కి ఫిబ్రవరి నెల అసలు ఏమాత్రం కలిసి రాలేదు . టాక్ లేని ‘ఫంకీ ‘ చిత్రం ఘోరమైన పహేలితాన్ని హోదాగా, పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ‘కపుల్ ఫ్రెండ్లీ ‘, ‘హే బల్వంత్’ చిత్రాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. ఇలాంటి సమయం బయ్యర్స్ తమ ఆశలన్నీ శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) చిత్రం మీదనే పెట్టుకున్నారు . టీజర్, ట్రైలర్ లతో ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. నేటి తరం జెన్ Z కి తగ్గట్టుగా డైలాగ్స్ తో శ్రీవిష్ణు రఫ్ఫాడించేసాడు. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఉండడంతో బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగింది. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ సినిమాకు ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది చూద్దాం.

ఈ చిత్రానికి ‘రాజా సాబ్ ‘ డైరెక్టర్ మారుతీ కథని అందించాడు. అయితే ట్రైలర్ లో చూపించినంత గా ఈ సినిమాలో ఏమి లేదని, చాలా అవుట్ డేటెడ్ కామెడీ ఎంటర్టైనర్ అని , శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కారణంగా అక్కడక్కడా కామెడీ బాగానే పేలింది కానీ, ఓవరాల్ గా మూవీ లో స్టోరీ లోపించడం వల్ల ఆడియన్స్ కి చిరాకు కలిగిస్తుందని అంటున్నారు. జెన్ Z ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం అత్యధిక శాతం మీమ్స్ రిఫరెన్స్ లు, మీమ్స్ మ్యూజిక్ ని ఉపయోగించారని, కొంతవరకు ఉపయోగిస్తే బాగుంటుంది కానీ, సినిమాలో అత్యధిక శాతం అవే ఉండడం తో కాస్త చిరాకు కలుగుతుందని చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక ఒక సినిమాకు పాటలు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీవిష్ణు గత చిత్రం ‘సింగిల్ ‘ లో కూడా పాటలు చాలా బాగుంటాయి . అది సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.

కానీ ఈ ‘విష్ణు విన్యాసం’ లో ఒక్క పాట కూడా ఆకట్టుకోలేదట. అది సినిమాకు చాలా పెద్ద మైనస్ అయ్యింది. శ్రీవిష్ణు తన యాక్టింగ్ తో చాలా వరకు నిలబెట్టాలని ప్రయత్నం చేశాడు, కానీ ఓవరాల్ గా ఎక్కడో ఎదో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ యాంగిల్ ని టచ్ చేశారు. అది కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ , వర్కౌట్ అయ్యింది. ఓవరాల్ గా ఈ చిత్రం శ్రీవిష్ణు ని అమితంగా ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది. ఎక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం నిరాశ చెందక తప్పదు. ట్విట్టర్ లోని కొన్ని రివ్యూస్ ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Exit mobile version