https://oktelugu.com/

కరోనా సోకిన వారికి గుడ్ న్యూస్.. ఆ ఛాన్స్ తక్కువ..?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 2 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే శాస్త్రవేత్తలు తాజాగా చేసిన అధ్యయనంలో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా సోకుతున్న వారిలో ఎక్కువమంది తొలిసారి కరోనా సోకుతున్న వాళ్లే కావడం గమనార్హం. కరోనా సోకిన వాళ్లకు మళ్లీ వైరస్ సోకడం అరుదుగా జరుగుతోంది. యూరోపియన్‌ యూనియన్‌ వ్యాధుల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 14, 2021 / 08:11 PM IST
    Follow us on

    దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 2 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే శాస్త్రవేత్తలు తాజాగా చేసిన అధ్యయనంలో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా సోకుతున్న వారిలో ఎక్కువమంది తొలిసారి కరోనా సోకుతున్న వాళ్లే కావడం గమనార్హం. కరోనా సోకిన వాళ్లకు మళ్లీ వైరస్ సోకడం అరుదుగా జరుగుతోంది.

    యూరోపియన్‌ యూనియన్‌ వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్న ప్రాంతాలలో రీఇన్ఫెక్షన్‌ పెద్దగా లేదని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. ఫస్ట్ వేవ్ లో కరోనా సోకిన ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు, ముగ్గురికి మాత్రమే రెండోసారి కరోనా సోకుతోంది. శాస్త్రవేత్తలు నాలుగున్నర నెలల పాటు అధ్యయనం నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు.

    ఫస్ట్‌ వేవ్‌లో కరోనా సోకిన వారిలో కేవలం 0.3 శాతం మందికి మాత్రమే మళ్లీ కరోనా సోకుతుండటం గమనార్హం. మరోవైపు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ప్రతి వెయ్యి మందిలో ఇద్దరిలో కరోనా నిర్ధారణ అవుతోంది. సీడీసీ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా 100 శాతం రక్షణ లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ లో కరోనా సోకిన వారికి మళ్లీ సోకే అవకాశం తక్కువే అయినా అప్రమత్తంగా ఉంటే మంచిది.

    కరోనా కొత్త స్ట్రెయిన్లు వస్తుండటంతో వాటిపై వ్యాక్సిన్ల ప్రభావం తక్కువని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా వచ్చిపోయిన వారి శరీరంలో యాంటీబాడీస్‌ ఉండటం, లేదా టీ సెల్స్‌ నుంచి రక్షణ దొరకడమే రీఇన్ఫెక్షన్‌ రాకపోవడానికి కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.