కండ్లు చల్లబడ్డాయి: అచ్చెన్న, లోకేష్ అప్యాయత

‘‘అరే..! ఇన్ సైడ్ వంద మాట్లాడుతాం బై.. అన్నీ బయటకు వస్తే ఎలా.. దొరికిపోమా.. ఎలా తలెత్తుకోవాలి.?’’  ఇప్పుడు ఏపీలో టీడీపీని, లోకేష్ ను తిట్టిన అచ్చెన్నాయుడు వీడియో బయటకొచ్చాక ఆయన ఆవేదన వర్ణానాతీతం అని అంటున్నారు. అంత మాటలు అన్నాక ఎలా చంద్రబాబు, లోకేష్ ను ఫేస్ చేయాలన్న ఆందోళన ఆయనలో ఉండేది. కానీ ఈరోజు పటాపంచలైంది. ఇద్దరిలో లోపాలున్నాయి.. ఇద్దరూ తప్పు చేశారు. లోలోపల రగిలిపోతున్న అగ్ని పర్వతాలను అణగదొక్కేసి తిరుపతిలోని అలిపిరి సాక్షిగా […]

Written By: NARESH, Updated On : April 14, 2021 7:54 pm
Follow us on

‘‘అరే..! ఇన్ సైడ్ వంద మాట్లాడుతాం బై.. అన్నీ బయటకు వస్తే ఎలా.. దొరికిపోమా.. ఎలా తలెత్తుకోవాలి.?’’  ఇప్పుడు ఏపీలో టీడీపీని, లోకేష్ ను తిట్టిన అచ్చెన్నాయుడు వీడియో బయటకొచ్చాక ఆయన ఆవేదన వర్ణానాతీతం అని అంటున్నారు. అంత మాటలు అన్నాక ఎలా చంద్రబాబు, లోకేష్ ను ఫేస్ చేయాలన్న ఆందోళన ఆయనలో ఉండేది. కానీ ఈరోజు పటాపంచలైంది.

ఇద్దరిలో లోపాలున్నాయి.. ఇద్దరూ తప్పు చేశారు. లోలోపల రగిలిపోతున్న అగ్ని పర్వతాలను అణగదొక్కేసి తిరుపతిలోని అలిపిరి సాక్షిగా అప్యాయత చాటుకున్నారు. నిజానికి వీరిద్దరిలో ఒకరంటే ఒకరికి పీకల్లోతు కోపం ఉండొచ్చని.. కానీ అలిపిరి నిరసన సమావేశంలో మాత్రం వీరిద్దరూ చూపిన సంయమనం.. అప్యాయత చూసి టీడీపీ శ్రేణుల కండ్లు చల్లబడ్డాయని చర్చ సాగుతోంది.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో టీడీపీ నేతతో మాట్లాడిన వీడియో ఒకటి నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘లోకేష్ ఉండగా తెలుగు దేశం పార్టీ బాగుపడదని’ అన్న అచ్చెన్నాయుడు డైలాగ్ చర్చనీయాంశమైంది. ఒక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అధినేత కుమారుడి శక్తిసామర్థ్యాలపై మాట్లాడిన ఈ మాట టీడీపీలో పెను దుమారం రేపింది.

అంతటి వీడియో లీక్ తర్వాత అచ్చెన్నాయుడు ఇది జగన్, వైసీపీ కుట్ర అని ఆరోపించి సైడ్ అయ్యారు. అయితే దీనిపై చంద్రబాబు, లోకేష్ లు ఏం మాట్లాడలేదు. అచ్చెన్న వ్యాఖ్యలపై వారిద్దరూ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

అచ్చెన్నాయుడు ఈ వీడియోలు బయటపడ్డాక అసలు చంద్రబాబును, లోకేష్ ను ఎలా ఫేస్ చేస్తారన్న ప్రశ్న అందరిలోనూ వ్యక్తమైంది. అయితే ఈరోజు బుధవారం అలిపిరి వద్ద నారా లోకేష్ నిరసన సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ వివేకా హత్యతో తనకు కానీ.. తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు. ఇదే క్రమంలోనే సీఎం జగన్ కూడా తనలాగా ఇక్కడికి తిరుమలేషుడి పాదల చెంతకు వచ్చి ప్రమాణం చేయాలని నారా లోకేష్ సవాల్ చేశారు.

ఇక్కడే అచ్చెన్నాయుడు, నారా లోకేష్ లు కలిసారు. నిన్న వీడియో రిలీజ్ తర్వాత మనసులో ఏం పెట్టుకోకుండా ఇద్దరూ గుసగుసలాడుకుంటూ తమ అన్యోన్యత చాటారు. వీరిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారోనని భావించిన తెలుగు తమ్ముళ్లకు వీరిద్దరి సాన్నిహిత్యం చూసి కండ్లు చల్లబడ్డాయని గుసగుసలాడుకున్నారు.