Site icon OkTelugu

America Israel differences: అమెరికా–ఇజ్రాయెల్‌ విభేదాలు.. ఇరాన్‌ యుద్ధంపై ఒత్తిడి?

America Israel differences

America Israel differences

America Israel differences: అమెరికా ఎప్పుడు యుద్ధం చేసినా ఒంటరిగా చేయదు. గతంలో ఆఫ్గానిస్తా, ఇరాక్‌పై యుద్ధాలే ఇందుకు నిదర్శనం. నాటో దేశాలను కలుపుకుని యుద్ధం చేస్తుంది. తాజాగా ఇరాన్‌పై యుద్ధానికి కూడా ఇజ్రాయెల్‌ను కలుపుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య ఉన్న విభేదాలను కారణంగా చూపి ఇజ్రాయెల్‌ను యుద్ధంలోకి దించింది. అమెరికా వెనక ఉండి ఆపరేట్‌ చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై ఉమ్మడి వాయు దాడులు చేస్తున్నాయి. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు అగ్ర సైనిక అధికారులు మరణించారు.

నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పత్రికా సమావేశంలో ఇజ్రాయెల్‌ అమెరికాను బలవంతంగా యుద్ధంలోకి నెట్టిందన్న ఆరోపణలను ఖండించారు. ‘ట్రంప్‌కు ఏం చేయాలో చెప్పాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?‘ అని ప్రశ్నించారు. ఇజ్రాయెల్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

తామే యుద్ధంలోకి తెచ్చాం..
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ కారణంగా అమెరికా యుద్ధం చేస్తోందన్న ఆరోపణలను తిరస్కరించారు. తామే ఇజ్రాయెల్‌ను యుద్దంలోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఇరాన్‌ ముందు దాడి చేస్తుందని భావించి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇరాన్‌ గ్యాస్‌ క్షేత్రాలపై ఇజ్రాయెల్‌ దాడి గురించి తనకు తెలియదని తెలిపారు.

అమెరికాకు తెలియకుండా దాడి..
ఇదిలా ఉంటే..ఇరాన్‌ సౌత్‌ పార్స్‌ గ్యాస్‌ క్షేత్రంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడి అమెరికాకు తెలియదని నెతన్యాహు ప్రకటించారు. ఈ దాడి తర్వాత ట్రంప్‌ మరిన్ని దాడులు చేయవద్దని కోరగా అంగీకరించామని చెప్పారు. ఈ ఘటన రెండు దేశాల మధ్య సమన్వయ లోపాలను బయటపెట్టింది.

అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌ అణు, క్షిపణి కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకున్నా, వ్యూహాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ట్రంప్‌ భూసైన్యాలు పంపకుండా వైమానిక దాడులపై దృష్టి పెట్టారు. నెతన్యాహు స్వతంత్ర చర్యలు తీసుకుంటున్నారు. ఈ విభేదాలు యుద్ధాన్ని సంక్లిష్టం చేస్తూ, ప్రపంచ చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి.

Exit mobile version