https://oktelugu.com/

స్మిత్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఇండియా నిలబడుతుందా?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. స్టీవ్ స్మిత్ సెంచరీ (131) పరుగులతో కదం తొక్కడంతో పటిష్ట స్థితిలో నిలిచింది. Also Read: ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్.. భారత్ కొంపముంచిన పంత్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్ గా కనిపిస్తున్న సిడ్నీలో ఈసారి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఏమాత్రం తడబడకుండా ఆడారు. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఫామ్ లేక తంటాలు పడుతున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2021 / 09:42 AM IST
    Follow us on

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. స్టీవ్ స్మిత్ సెంచరీ (131) పరుగులతో కదం తొక్కడంతో పటిష్ట స్థితిలో నిలిచింది.

    Also Read: ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్.. భారత్ కొంపముంచిన పంత్

    పూర్తిగా బ్యాటింగ్ పిచ్ గా కనిపిస్తున్న సిడ్నీలో ఈసారి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఏమాత్రం తడబడకుండా ఆడారు. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఫామ్ లేక తంటాలు పడుతున్న స్టీవ్ స్మిత్ కుదురుకొని సెంచరీ కొట్టడం విశేషం. రెండోరోజు 166/2తో శుక్రవారం ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మరో 172 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది.

    స్టీవ్ స్మిత్ తోపాటు తో లుబుషేన్ 91 పరుగులతో రాణించాడు. ఇక భారత బౌలర్లలో జడేజా ఒక్కడే రాణించాడు. నాలుగు వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. అందరూ ఔట్ అవుతున్నా ఓ ఎండ్ లో స్మిత్ ఒంటరిపోరాటం చేశఆడు. చివర్లో ధాటిగా ఆడి జట్టు స్కోరును 338 పరుగులకు తీసుకెళ్లాడు. సైనీ భారీగా పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు.

    Also Read: ఫస్ట్‌ డే ఆస్ట్రేలియాదే..

    ఇక మూడోరోజు భారత్ ఎలా ఆడుతుందనే దానిపైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంది. ఓపెనర్లు శుభ్ మన్, రోహిత్ క్రీజులో కొంచెం కంఫర్ట్ గానే కనిపించారు. ఆస్ట్రేలియా విసిరిన 338 పరుగులను కాపాడుకొని పరుగులు సాధిస్తే విజయం తథ్యం లేదంటే మల్లీ ఓటమి ఎదురవడం ఖాయం.. మరి మన బ్యాట్స్ మెన్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.