అప్పటి ముచ్చట్లు : బికినీ వేసినా ‘ఫ్యామిలీ హీరోయిన్’లానే చూశారు !

నటన అంటే సహజత్వం ఉండాలి. తెలుగులో అలాంటి సహజ నటి అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘జయసుధ’. ఎన్నో సినిమాల్లో, మరెన్నో భాషల్లో మహానటి సావిత్రిగారి తర్వాత అంతటి స్థాయిలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఫ్యామిలీ హీరోయిన్ జయసుధనే. ఆ రోజుల్లో జయప్రద, శ్రీదేవి అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ… జయసుధకు గట్టి పోటీ ఇచ్చిన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జయసుధ. ఇప్పటికీ అమ్మగా అమ్మమ్మగా మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇక […]

Written By: admin, Updated On : March 18, 2021 3:50 pm
Follow us on


నటన అంటే సహజత్వం ఉండాలి. తెలుగులో అలాంటి సహజ నటి అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘జయసుధ’. ఎన్నో సినిమాల్లో, మరెన్నో భాషల్లో మహానటి సావిత్రిగారి తర్వాత అంతటి స్థాయిలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఫ్యామిలీ హీరోయిన్ జయసుధనే. ఆ రోజుల్లో జయప్రద, శ్రీదేవి అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ… జయసుధకు గట్టి పోటీ ఇచ్చిన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జయసుధ. ఇప్పటికీ అమ్మగా అమ్మమ్మగా మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇక జయసుధ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

Also Read: టీజర్ టాక్: ‘కేజీఎఫ్2’ అంచనాలకు మించి..

జయసుధకు ఆమె తల్లితండ్రులు పెట్టిన అసలు పేరు సుజాత. ఆమె చెన్నైలోనే పుట్టి పెరిగారు. ఇక జయసుధకు చిన్నప్పటి నుండే సినిమా ప్రపంచంతో దగ్గరి సంబంధం ఉంది. ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల జయసుధకి స్వయానా పిన్ని అవ్వడంతో.. అప్పుడప్పుడు షూటింగ్ లకు వెళ్ళేవారట. అలా ఆమె జీవితంలోకి తెలియకుండానే సినిమా ప్రవేశించింది. ఇక విజయనిర్మలగారి ప్రేరణతోనే జయసుధ సినిమా రంగం వైపు అడుగులు వేసింది. ఆ రోజుల్లోనే బికినీ వేసి అప్పటి యూత్ కి తనలోని గ్లామర్ ను పరిచయం చేసినా.. ఆమెను మాత్రం ఎక్కువుగా ఫ్యామిలీ హీరోయిన్ గానే చూశారట. హీరోలు కూడా తనలోని గ్లామర్ ను గుర్తించలేదు. అందుకే జయప్రద, శ్రీదేవి లాగా కమర్షియల్ సినిమాలు ఎక్కువుగా చేయలేకపోయాను అని అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు జయసుధ.

Also Read: ‘క్రాక్’ కిరాక్ బిజినెస్.. అన్ని కోట్లా?

కాగా జయసుధ అభిమానుల మదిలో ప్రియసుధగా మారడానికి.. ఆమె నటనతో పాటు ఆమె నటించిన పాత్రలు కూడా మెయిన్ రీజన్. ఆమె ప్రతి పాత్రకు ప్రాణం పోసింది. పలు మార్లు ఉత్తమనటిగా నిలచి విమర్శకుల ప్రశంసలతో పాటు రసికుల మనసూ దోచుకుంది. అప్పటి మేటి హీరోల సరసన తనదైన శైలితో మురిపించింది. ‘సహజనటి’గా జేజేలు అందుకుంది. ముఖ్యంగా ‘జ్యోతి’, ‘శివరంజని’, ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ లాంటి సినిమాలతో పాటు ‘ఇది కథ కాదు’ సినిమాలతోనూ మెప్పించింది. ఇక జయసుధకు ఇద్దరు పిల్లలు నిహార్, శ్రేయాన్. 2017లో ఆమె భర్త నితిన్ కపూర్ మరణించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్