https://oktelugu.com/

ఫోన్ పే యూజర్లకు శుభవార్త.. రూ.149కే ఇన్సూరెన్స్ పాలసీ..?

భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరపడానికి ఉపయోగించే యాప్ లలో ఒకటైన ఫోన్ పే యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం 149 రూపాయల ప్రీమియంతో ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ CCతో ఒప్పందం కుదుర్చుకుని ఫోన్ పే ఈ పాలసీని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఈ పాలసీని ఆన్ లైన్ లోనే తీసుకునే అవకాశం ఉంటుంది. Also Read: స్మిత్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఇండియా నిలబడుతుందా? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 8, 2021 10:52 am
    Follow us on

    PhonePe

    భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరపడానికి ఉపయోగించే యాప్ లలో ఒకటైన ఫోన్ పే యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం 149 రూపాయల ప్రీమియంతో ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ CCతో ఒప్పందం కుదుర్చుకుని ఫోన్ పే ఈ పాలసీని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఈ పాలసీని ఆన్ లైన్ లోనే తీసుకునే అవకాశం ఉంటుంది.

    Also Read: స్మిత్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఇండియా నిలబడుతుందా?

    ఎటువంటి పేపర్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా హెల్త్ చెకప్ చేయించుకోకుండా సులభంగా పాలసీని తీసుకునే అవకాశాన్ని ఫోన్ పే కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఫోన్ పే యూజర్ల కొరకు అందుబాటులోకి తెచ్చిన ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను క్షణాల వ్యవధిలో తీసుకోవచ్చు. అయితే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

    Also Read: ట్రాక్టర్ల ర్యాలీతో కాక పుట్టించిన రైతులు

    ఎవరైతే కుటుంబ ఆర్థిక భద్రత కోసం పాలసీ తీసుకోవాలని భావిస్తారో అలాంటి వాళ్లకు ఈ పాలసీ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న ఫోన్ పే యాప్ ను వినియోగించే యూజర్లు ఎవరైనా సంవత్సరానికి 149 రూపాయల ప్రీమియంతో పాలసీని తీసుకోవచ్చు. ఫోన్ పే యూజర్లు పాలసీ గడువులోగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పాలసీకి సంబంధించిన నగదు జమవుతుంది.

    మరిన్ని జాతీయం వార్తల కోసం జాతీయం

    ఫోన్ పే యాప్ లోని మై మనీ ఆప్షన్ ద్వారా సులభంగా ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. లక్ష రూపాయల నుంచి 20 లక్షల రూపాయల మొత్తానికి ఈ పాలసీని తీసుకోవచ్చు. ఫోన్ పే యూజర్లు వారి సంవత్సర ఆదాయానికి పది రెట్లు ఎక్కువ మొత్తం పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది.