https://oktelugu.com/

కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. బాధితుల్లో ఆ సమస్యలు..?

ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను సైతం ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామంది నీరసం, ఆయాసం, ఒళ్లునొప్పులతో బాధ పడుతున్నారు. కరోనా సోకిన సమయంలో ఐదు కంటే ఎక్కువ లక్షణాలు కనిపించిన వాళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లకు కరోనా ముప్పు ఎక్కువని చెప్పవచ్చు. కరోనా నుంచి కోలుకున్న 14 రోజుల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 15, 2021 / 09:08 AM IST
    Follow us on

    ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను సైతం ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామంది నీరసం, ఆయాసం, ఒళ్లునొప్పులతో బాధ పడుతున్నారు. కరోనా సోకిన సమయంలో ఐదు కంటే ఎక్కువ లక్షణాలు కనిపించిన వాళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లకు కరోనా ముప్పు ఎక్కువని చెప్పవచ్చు.

    కరోనా నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తుంటే దీర్ఘ కోవిడ్ గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన 12 వారాల తర్వాత కూడా లక్షణాలు కొనసాగితే పోస్ట్ కొవిడ్ గా చెప్పవచ్చు. 14 రోజుల తర్వాత శరీరంలో వైరస్ లేకపోయినా వైరస్ అవశేషాలు ఉంటాయని అందువల్ల 3 నెలల వరకు పరీక్షల్లో పాజిటివ్ గా తేలవచ్చని అధికారులు చెబుతున్నారు. వైరస్ ప్రభావం వల్ల కొంతమందిలో ఊపిరితిత్తులు కుంచించుకుపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    ఊపిరితిత్తుల కణజాలం దెబ్బ తిన్నవాళ్లలో ఆక్సిజన్ సరిగ్గా లోపలికి వెళ్లకపోవడం వల్ల ఆయాసం ముంచుకొస్తుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. పర్ఫెనిడోన్, నింటెడానిబ్ మందులను వాడ్తం వల్ల కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో గుండెదడ లక్షణం కనిపిస్తోంది. బీటా బ్లాకర్ల సహాయంతో గుండె వేగం తగ్గించవచ్చు. అయితే గుండెపై పని చేసే బీటా బ్లాకర్లు కాకుండా ఇతర రకం బీటా బ్లాకర్లు వాడితే ఆస్తమా లాంటి సమస్యలు ఉధృతమయ్యే అవకాశాలు ఉంటాయి.

    కరోనా నుంచి కోలుకున్న తర్వాత దగ్గు సమస్య వేధిస్తుంటే క్షయ, ఇతర జబ్బులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఈ దగ్గు వాపుప్రక్రియ వల్ల వచ్చే దగ్గు కాబట్టి యాంటీబయోటిక్ మందులు పని చేయవు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు కఠినమైన వ్యాయామాలు చేయకూడదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కొన్నిసార్లు రక్తహీనత వల్ల నీరసం, నిస్సత్తువ లాంటి సమస్యలు వస్తాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను ఏ ఆరోగ్య సమస్య వేధించినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదిస్తే మంచిది.