తెలంగాణలో నేటినుంచే రైతుబంధు సాయం.. ఆ జిల్లాకే అత్యల్పం..?

తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరేలా రైతు బంధు స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 63.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో కోటి 50 లక్షల 18వేల ఎకరాలకు సంబంధించిన నగదు జమ కానుంది. సీసీఎల్ఏ ఇప్పటికే రైతులు, భూముల వివరాలతో కూడిన జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసింది. ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం ఏకంగా రూ.7508.78 కోట్లను జమ చేయనుందని తెలుస్తోంది. 2021 […]

Written By: Navya, Updated On : June 15, 2021 12:39 pm
Follow us on

తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరేలా రైతు బంధు స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 63.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో కోటి 50 లక్షల 18వేల ఎకరాలకు సంబంధించిన నగదు జమ కానుంది. సీసీఎల్ఏ ఇప్పటికే రైతులు, భూముల వివరాలతో కూడిన జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసింది. ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం ఏకంగా రూ.7508.78 కోట్లను జమ చేయనుందని తెలుస్తోంది.

2021 – 2022 సంవత్సరం వర్షాకాలం, యాసంగి సీజన్లలో ఈ స్కీమ్ అమలు కోసం తెలంగాణ సర్కార్ రూ.7508.78 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. నేషనల్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారని సమాచారం అందుతోంది. మొదటి రోజున ఎకరంలోపు రైతులకు నగదు జమ కానుండగా క్రమంగా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారని సమాచారం.

కొత్తగా భూములను కొనుగోలు చేయడం ద్వారా 2.81 లక్షల మంది రైతులు అదనంగా రైతుబంధు సాయాన్ని అందుకోనున్నారని తెలుస్తోంది. పార్ట్–బీలో సమస్యలు పరిష్కారమై పార్ట్ ఏలోకి చేరడంతో కొత్తగా మరో 66,311 ఎకరాలు రైతు బంధు సాయం పొందే వీలు కలిగిందని తెలుస్తోంది. వర్షాకాలం రైతు బంధు నిధులను అత్యల్పంగా అందిన జిల్లాగా మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి జిల్లా నిలిచింది.

వారసత్వ బదిలీ, కోర్టు కేసుల్లో ఉన్నవి, పెండింగ్‌ మ్యుటేషన్‌లకు సంబంధించిన సమస్యలు, ఆధార్ అనుసంధానం, ఎన్‌ఆర్‌ఐ కేసులు, ఏజన్సీ భూ సమస్యలు, ఫిర్యాదుల ద్వారా వచ్చినవి, ఇతర సమస్యలను కూడా పరిష్కారం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.