https://oktelugu.com/

కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు షాక్.. వాళ్లలో షుగర్..?

కరోనా వైరస్ బారిన పడితే వైరస్ నుంచి కోలుకున్న తరువాత కూడా దాని ప్రభావం శరీరంపై ఉంటుందనే సంగతి తెలిసిందే. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత చాలామందికి షుగర్ నిర్ధారణ అవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుండటం గమనార్హం. శాస్త్రవేత్తలు మిలియన్ల మంది రికార్డులను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం కరోనా సోకిన తరువాత డయాబెటిస్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ అధ్యయనం కరోనా వల్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 6, 2021 / 08:16 AM IST
    Follow us on

    కరోనా వైరస్ బారిన పడితే వైరస్ నుంచి కోలుకున్న తరువాత కూడా దాని ప్రభావం శరీరంపై ఉంటుందనే సంగతి తెలిసిందే. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత చాలామందికి షుగర్ నిర్ధారణ అవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుండటం గమనార్హం. శాస్త్రవేత్తలు మిలియన్ల మంది రికార్డులను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.

    ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం కరోనా సోకిన తరువాత డయాబెటిస్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ అధ్యయనం కరోనా వల్ల డయాబెటిస్ రోగుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుందని ఇన్సులిన్ ను తయారు చేసే గ్రంథికి ఇబ్బంది ఎదురవడంతో చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారని తెలుస్తోంది. కరోనా నెగిటివ్ వచ్చినా జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    నెగిటివ్ వచ్చిన మూడు నెలల తర్వాత వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వల్ల గుండె, మెదడు, కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత కొంతమందికి గుండెపోటు, షుగర్ వస్తున్నాయి. కరోనా తగ్గిన తర్వాత షుగర్ కంట్రోల్ కావడం లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

    మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు పాలసీ ఇవ్వడానికి బీమా కంపెనీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కరోనా వల్ల క్లెయిమ్ల సంఖ్య పెరగడంతో భారీగా నష్టం వాటిల్లుతోందని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయు. కరోనా నుంచి కోలుకున్న వారి విషయంలో బీమా సంస్థలు వెనుకడుగు వేస్తుండటం గమనార్హం.