
కరోనా నేపథ్యంలో రైల్వేలకు సంబంధించిన అన్ని ఆరోగ్య కేంద్రాలలో సమయానుకూలంగా వైద్యం అందించడానికి అదనపు పడకలు సిద్ధం చేయాలని డివిజన్ రైల్వే మేనేజర్లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదేశించారు. రైళ్ల భద్రత, సరుకురవాణా, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొవిడ్ తీవ్రత, అందించాల్సిన వైద్య సదుపాయాలపై బుధవారం ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. రైల్వే బోర్డు సూచనల ప్రకారం స్టేషన్ లలో పొగ తాగకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని స్టేషన్ లలో తరుచుగా శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు.