ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. సైనిక్ స్కూల్ లో ఉద్యోగ ఖాళీలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్ శుభవార్త చెప్పింది. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం కలికిరి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 10 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్ కార్పొరేషన్ […]

Written By: Navya, Updated On : April 1, 2021 11:47 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్ శుభవార్త చెప్పింది. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం కలికిరి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 10 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్ కార్పొరేషన్ లో 89 ఉద్యోగాలు..?

https://sskal.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీచింద్, నాన్ టీచింగ్ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. మొత్తం 23 ఉద్యోగ ఖాళీలలో హెడ్‌ మాస్టర్‌, ప్రీ ప్రైమరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్, మ్యూజిక్‌/డ్యాన్స్‌ టీచర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పీఈటీ, హెడ్‌క్లర్క్, కౌంట్‌ క్లర్క్, డ్రైవర్‌, ఆయా, ఎంటీఎస్ లాంటి నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులైన వాళ్లు హెడ్ మాస్టర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా హెడ్ మాస్టర్ కు నెలకు రూ.35,000 వేతనం లభిస్తుంది. ఇంటర్మీడియట్, ఎన్‌టీటీసీ ఉత్తీర్ణులైన వాళ్లు ప్రీ ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వీరికి నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

Also Read: నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో బెల్ లో ఉద్యోగాలు..?

గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ పాసైన వాళ్లు ప్రైమరీ టీచర్ల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వీరికి నెలకు రూ.20,000 వేతనం లభిస్తుంది. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్, మ్యూజిక్‌/డ్యాన్స్‌ టీచర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్, పీఈటీ ఉద్యోగాలకు నెలకు రూ.20,000 హెడ్‌క్లర్క్, కౌంట్‌ క్లర్క్ ఉద్యోగాలకు 15,000 మిగిలిన ఉద్యోగాలకు 12,000 రూపాయల చొప్పున వేతనం లభిస్తుంది.