https://oktelugu.com/

సుకన్య సమృద్ధి స్కీమ్ లో చేరిన వాళ్లకు షాకింగ్ న్యూస్..?

దేశంలో చాలామంది ఇంట్లోని ఆడపిల్లల పేర్లపై సుకన్య సమృద్ధి ఖాతాను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. సుకన్య సమృద్ధి ఖాతాను కూతురు పేర్లపై కలిగి ఉన్నవాళ్లు ఈరోజులోపు డబ్బులు ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి. ఈరోజు తర్వాత డబ్బులు డిపాజిట్ చేస్తే మాత్రం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం సుకన్య సమృద్ధి ఖాతాను కలిగి ఉన్నవాళ్లు డబ్బులను కచ్చితంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్ కార్పొరేషన్ లో 89 ఉద్యోగాలు..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 1, 2021 10:16 am
    Follow us on

    Sukanya Samriddhi Yojana Scheme

    దేశంలో చాలామంది ఇంట్లోని ఆడపిల్లల పేర్లపై సుకన్య సమృద్ధి ఖాతాను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. సుకన్య సమృద్ధి ఖాతాను కూతురు పేర్లపై కలిగి ఉన్నవాళ్లు ఈరోజులోపు డబ్బులు ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి. ఈరోజు తర్వాత డబ్బులు డిపాజిట్ చేస్తే మాత్రం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం సుకన్య సమృద్ధి ఖాతాను కలిగి ఉన్నవాళ్లు డబ్బులను కచ్చితంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్ కార్పొరేషన్ లో 89 ఉద్యోగాలు..?

    కనీసం 500 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా సుకన్య సమృద్ధి ఖాతాను కలిగి ఉండి డిపాజిట్ చేయకపోతే మాత్రం ఖాతా ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖాతా ఇన్ యాక్టివ్ అయితే యాక్టివేట్ చేయించుకోవడం కోసం 50 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పెనాల్టీతోపాటు మినిమమ్ డిపాజిట్ డబ్బులను చెల్లిస్తే మాత్రమే ఖాతా యాక్టివేట్ అవుతుంది.

    కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సుకన్య సమృద్ధి స్కీమ్ వడ్డీరేట్లను ఒకసారి సమీక్షిస్తుంది. కొన్నిసార్లు వడ్డీరేట్లు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. నెలకు 3,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 15 లక్షల రూపాయలు పొందవచ్చు. నెలకు గరిష్టంగా రూ.12,500 ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు.

    ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు కాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఆడపిల్లలకు ఉన్నత చదువులు చదివించడానికి పెళ్లి చేయడానికి ఇబ్బందులు ఎదురు కావు.