https://oktelugu.com/

కులాలు, కాపు రిజర్వేషన్లపై సోము వీర్రాజు సంచలన ప్రకటన

ఏపీ అంటేనే కులాల కొట్లాట అన్న విమర్శ ఉంది.. ప్రతి రాజకీయ పార్టీ కూలాలను ఎగదోసి రాజకీయ లబ్ధి పొందుతున్నదే. రెడ్డిలకు జగన్, కమ్మలకు చంద్రబాబు నాయకత్వం వహిస్తూ మధ్యలో మెజార్టీ వర్గాలైన బీసీలు, కాపులకు పదవులు ఇస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కానీ అణగారిన వర్గాల కోసం ఇప్పుడు బీజేపీ నడుంబిగించింది. తిరుపతి ఉప ఎన్నికల వేళ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. మాదిగ దండోరా, బోయ, రజక […]

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2021 7:01 pm
    Follow us on

    ఏపీ అంటేనే కులాల కొట్లాట అన్న విమర్శ ఉంది.. ప్రతి రాజకీయ పార్టీ కూలాలను ఎగదోసి రాజకీయ లబ్ధి పొందుతున్నదే. రెడ్డిలకు జగన్, కమ్మలకు చంద్రబాబు నాయకత్వం వహిస్తూ మధ్యలో మెజార్టీ వర్గాలైన బీసీలు, కాపులకు పదవులు ఇస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కానీ అణగారిన వర్గాల కోసం ఇప్పుడు బీజేపీ నడుంబిగించింది. తిరుపతి ఉప ఎన్నికల వేళ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు.

    మాదిగ దండోరా, బోయ, రజక కులాలను గ్రూపులు మార్చడం, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం వంటి అంశాల పట్ల బీజేపీ సానుకూలంగా ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణపై మాదిగలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా చూశాయని.. కానీ మాదిగ దండోరాకు ముందు నుంచి బీజేపీ బీజేపీ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.

    2019 ఎన్నికల మేనిఫెస్టోలోనూ మాదిగ దండోరా ఉద్యమ హక్కులకు మద్దతుగా మేనిపెస్టోలో అంశాన్ని ఉంచినట్లు సోము వీర్రాజు తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి కిషన్ రెడ్డి వరకు అందరూ దండోరా ఉద్యమాన్ని బలపరిచిన విషయాన్ని గుర్రుచేశారు.

    ఖచ్చితంగా బీసీలు, అణగారిన వర్గాలు, కాపుల రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని.. ఏపీలో అధికారంలోకి వస్తే దీన్ని మొదటి ప్రాధాన్యతగా అమలు చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షులు ప్రకటించారు.

    ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ నాయకత్వం రానున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 3వ తేదీ నుంచి జైత్రయాత్ర పేరుతో ప్రచారానికి శ్రీకారం చుడుతారని చెప్పారు.

    తిరుపతిలో విపక్షాలకు ఓట్లు పడకుండా జగన్ కుట్ర చేస్తున్నారని.. వైసీపీకి 5 లక్షల మెజార్టీ ఖాయమని ఎలా చెబుతారని సోము వీర్రాజు ప్రశ్నించారు. అసలు గ్రామానికి 2వేల ఓట్లు పోలైతే 5 లక్షల మెజార్టీ ఎలా వస్తుందని నిలదీశారు. వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోందన్నారు. వాలంటీర్లతో గెలవాలని చూస్తోందని.. పోలీసులు, అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు.

    తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సహ ఇన్ చార్జి సునీల్ ధియేధర్ తో కలిసి సోము వీర్రాజు మాట్లాడారు.