https://oktelugu.com/

రాహుల్ తో రేవంత్.. సోనియాతో కోమటిరెడ్డి భేటి?

టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఆ పదవీ ఖాళీ ఏర్పడింది. ఈ పోస్టును దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని సీనియర్లు అధిష్టానం వద్ద పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ ఎత్తుగడ వేసి వేసింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఇటీవలే హైదరాబాద్లో మకాం వేసి కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నివేదిక అధిష్టానానికి సమర్పించారు. టీపీసీసీపై ఎవరీకైనా అభ్యంతరాలుంటే అధిష్టానానికి చెప్పుకోవచ్చని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 / 02:21 PM IST
    Follow us on

    టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఆ పదవీ ఖాళీ ఏర్పడింది. ఈ పోస్టును దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని సీనియర్లు అధిష్టానం వద్ద పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ ఎత్తుగడ వేసి వేసింది.

    కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఇటీవలే హైదరాబాద్లో మకాం వేసి కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నివేదిక అధిష్టానానికి సమర్పించారు. టీపీసీసీపై ఎవరీకైనా అభ్యంతరాలుంటే అధిష్టానానికి చెప్పుకోవచ్చని తెలియజేశారు.

    టీపీసీసీ చీఫ్ ఎంపిక చివరి దశకు చేరుకోవడంతో నేతలంతా ఢిల్లీకి పయనమవుతున్నారు. టీపీసీసీ రేసులో అందరికీ కంటే ముందున్న ఎంపీ రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నేడు ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

    రాహుల్ గాంధీతో ఎంపీ రేవంత్ రెడ్డి భేటి కానుండగా మరోవైపు సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటి కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ టీపీసీసీని రేవంత్ కు కట్టబెట్టాలని చూస్తుండటంతో కోమటిరెడ్డిని సోనియాతో భేటి అయ్యేందుకు ఢిల్లీకి వెళుతున్నారు.

    టీపీసీసీ కాంగ్రెస్ నేతకే ఇవ్వాలని బయటి నుంచి వచ్చిన నేతలు పార్టీలో ఎన్నిరోజులు ఉంటారో తెలియదని సోనియాకు కోమటిరెడ్డి వివరించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో బండి సంజయ్ కు ఇచ్చినట్టే కాంగ్రెస్ లోనూ పార్టీ మనిషికే టీపీసీసీ ఇవ్వాలని కోమటిరెడ్డి కోరుతున్నారు.

    తాను ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని.. టీపీసీసీ ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానని.. చెప్పారు. పీసీసీ పదవీని తాను ఆశించడంలో తప్పేమిలేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడు. దీంతో వీరిద్దరిలో ఎవరికీ టీపీసీసీ దక్కుతుందా? అనే ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.